Telangana Election: ఇన్స్‌పెక్టర్‌పై అనుచిత వాఖ్యలు.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు

ఎన్నికల ప్రచారంలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బహిరంగంగా బెదిరించినందుకు AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. సంతోష్‌నగర్ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ తమ్ముడు అక్బరుద్దీన్‌పై ఆర్పీ యాక్ట్ కింద Cr.No.308/2023 సెక్షన్ 353, 153(ఎ), 506, 505(2), సెక్షన్ 125 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Telangana Election: ఇన్స్‌పెక్టర్‌పై అనుచిత వాఖ్యలు.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు
Akbaruddin Owaisi

Edited By:

Updated on: Nov 22, 2023 | 4:24 PM

ఎన్నికల ప్రచారంలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బహిరంగంగా బెదిరించినందుకు AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. సంతోష్‌నగర్ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ తమ్ముడు అక్బరుద్దీన్‌పై ఆర్పీ యాక్ట్ కింద Cr.No.308/2023 సెక్షన్ 353, 153(ఎ), 506, 505(2), సెక్షన్ 125 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్‌ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం నవంబర్ 21వ తేదీన హైదరాబాద్‌లోని లలితాబాగ్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. మోడల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం సమావేశాన్ని సమయానికి ముగించాలని పోలీసు ఇన్‌స్పెక్టర్ అతన్ని కోరారు. విధుల్లో ఉన్న పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించి అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. రాత్రి పదిగంటలకు ప్రచారం ముగించాల్సి ఉండగా.. ఐదు నిమిషాల ముందే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సంతోషన్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివచంద్రని చూసిన అక్బరుద్దీన్‌ ఫుల్‌ ఫైర్‌ అయ్యారు.

ప్రచార సమయానికి ఇంకా 5 నిమిషాలు ఉండగానే పోలీసులు తన సభను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. ఈ ఐదు నిమిషాలు కూడా మాట్లాడతానని.. తనను ఆపే దమ్మున్నోడు పుట్టలేదంటూ ఇన్‌స్పెక్టర్‌పై ఫైర్‌ అయ్యారు. ఒక్కసైగ చేస్తే చాంద్రాయణగుట్ట నుంచి పరుగులు పెట్టాల్సిందే అంటూ ప్రసంగించారు. తనకు ఇక్కడ పోటీయే లేదని.. పోలీసులే ఇప్పుడు ప్రత్యర్థులుగా వస్తున్నారన్నారు. రండి గెలిచేది మీరా.. నేనా అంటూ సవాల్‌ విసిరారు.

అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమర్థించారు. సమయానికి ముందే వెళ్ళిపోవాలనడం సరికాదన్నారు. ఎన్నికల సంఘం కెమెరాలో స్పష్టం ఉందని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని అసద్ డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…