NagarKurnool: ఖాకీ యూనిఫాంకు మచ్చ తెచ్చారు.. రహస్యంగా ఫోటోలు తీసి..

బ్లాక్ మెయిలింగ్, వసూళ్ల వ్యవహారాలతో పోలీసు యంత్రాంగానికి మాయని మచ్చ తెచ్చారు ఇద్దరు బ్లూకోట్ కానిస్టేబుల్స్. ఇదే తరహాలో వేగంగా పోలీసింగ్ అందాలన్న డయల్ 100 లక్ష్యాన్ని తుంగలోతొక్కి వసూళ్లకు తెగించాడు మరో కానిస్టేబుల్. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో తనకారులో స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నాడు.

NagarKurnool: ఖాకీ యూనిఫాంకు మచ్చ తెచ్చారు.. రహస్యంగా ఫోటోలు తీసి..
Cops Blackmail
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 03, 2024 | 1:17 PM

బ్లాక్ మెయిలింగ్, వసూళ్ల వ్యవహారాలతో పోలీసు యంత్రాంగానికి మాయని మచ్చ తెచ్చారు ఇద్దరు బ్లూకోట్ కానిస్టేబుల్స్. ఇదే తరహాలో వేగంగా పోలీసింగ్ అందాలన్న డయల్ 100 లక్ష్యాన్ని తుంగలోతొక్కి వసూళ్లకు తెగించాడు మరో కానిస్టేబుల్. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిలో తనకారులో స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో బ్లూకోట్ కానిస్టేబుల్ రహస్యంగా వారి ఫోటోలను తీసి… ఒంటరిగా ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు.

అనంతరం కేసు నమోదు చేస్తానని, పరువుతీస్తానని చెప్పి భయభ్రాంతులకు గురిచేశాడు. చివరకు అలా చేయకుండా ఉండాలంటే రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక సదరు వ్యక్తి రూ.2000 ఇస్తానని ప్రాధేయపడ్డాడు. ఒప్పుకున్న కానిస్టేబుల్ అమౌంట్‌ను తన స్నేహితుడికి ఫోన్ పే చేయించుకున్నాడు. అంతటితో ఆగని ఈ వ్యవహారంలో కొద్దిరోజుల తర్వాత మరో కానిస్టేబుల్ దూరాడు. సదరు వ్యక్తికి ఫోన్ చేసి తనకు రూ.10వేలు ఇవ్వాలని… లేదంటే ఫోటోలను మీ భార్య, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదరించాడు. పోలీసుల బెదిరింపులతో విసుగుచెందిన సదరు వ్యక్తి తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడు.

దీంతో సదరు కానిస్టేబుల్ బెదిరించినట్లే భార్య, కుటుంబ సభ్యులకు ఫోటోలు పంపాడు. అవి చూసిన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబసభ్యులు కాపాడారు. విషయం తెలుసుకోని భర్త సైతం ఆత్మహత్యాయత్నం చేశాడు. వరుస ఘటనలు ఒక్కసారిగా కుటుంబంలో కలకలం రేపాయి. పోలీసులు అసలు మ్యాటర్ ఆరా తీయగా బ్లూకోట్ పోలీసుల బ్లాక్ మెయిలింగ్ తెరమీదకు వచ్చింది.

ఇదంతా ఒక ఎత్తైతే  బ్లూ కోట్ కానిస్టేబుళ్ల బ్లాక్ మెయిల్ విచారణ వ్యవహారం మరోఎత్తు. ఇష్యుతో సంబంధంలేని కానిస్టేబుల్‌ను సస్పెన్షన్ చేసి బాధితులకు ట్విస్ట్ ఇచ్చారు. బ్లాక్ మెయిల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో వెంటనే రాంచందర్, చిన్నా అనే ఇద్దరి కానిస్టేబుళ్లపై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ సస్పెన్షన్ విధించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సస్పెన్షన్ పడిన వారిలో కానిస్టేబుల్‌కు ఎలాంటి సంబంధం లేదన్న వాదన తెరమీదకు వచ్చింది. దీంతో మరోసారి విచారణ చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ చిన్నాపై సస్పెన్షన్ ఎత్తివేసి… ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్న రాము అనే మరో కానిస్టేబుల్‌ను సస్పెన్షన్ చేసి దిద్దుబాటు చేశారు.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే