PM Modi Hyd Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ISB 20వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గచ్చిబౌలిలోని ISB చేరుకుంటారు ప్రధాని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ విద్యార్ధుల స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు మోదీ.
ప్రధాని మోదీ షెడ్యూల్ వివరాలివే..
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్న 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. 20 నిముషాల పాటు ఎయిర్‌పోర్ట్‌లో ఉంటారు. ఆ సమయంలో ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు సమావేశమవుతారు. తరువాత ప్రత్యేక హెలికాప్టర్‌లో గచ్చిబౌలి వెళ్తారు. ISB లో గంటన్నర సేపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్తారు.
అక్కడి నుంచి ఐఎస్‌బి కి వెళ్తారు. ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ISB నుంచే కాకుండా మొహాలీ ISB నుంచి సైతం 330 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. డిసెంబర్ 2, 2001లో హైదరాబాద్ ISBని మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయ్ ప్రారంభించారు. దేశంలో అత్యుత్తమ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచింది ఈ సంస్థ. వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ISB సిబ్బందికి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్‌లో ముందంజలో ఉంది.
కాగా, హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వస్తుండడంతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పంజాబ్ రైతుల ఆందోళనల నేపథ్యంలో పంజాబ్ నుంచి వస్తున్న ప్రతి విద్యార్థి బ్యాక్ గ్రౌండ్‌ను వెరిఫై చేస్తున్నారు భద్రతా అధికారులు. సోషల్ మీడియా అకౌంట్లపైనా దృష్టి పెట్టారు. ఇక సుమారు 1500 మంది పోలీసులతో భారీ భద్రత నడుమ గచ్చిబౌలిలో ప్రధాని మోదీ పర్యటన ఉండబోతుంది. ISB సమీపంలోని ఐటీ కంపెనీల ఉద్యోగులు ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని సూచించారు పోలీసులు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతునట్టు ప్రకటించారు.
జోష్‌లో బీజేపీ శ్రేణులు..
మోదీ పర్యటన సందర్భంగా బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. నగరమంతా కాషాయమయం అయ్యింది. ప్రధానికి స్వాగతం చెబుతూ భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు దగ్గర 40 వేల మందితో స్వాగతం చెప్పేందుకు జనసమీకరణ చేస్తున్నారు కమలనాథులు. అమిత్ షా, నడ్డా టూర్ ద్వారా పార్టీలో ఫుల్ జోష్ వచ్చింది. ఇదే ఉత్సాహంతో ప్రధాని మోదీ టూర్ ను సైతం.. సానుకూలం చేసుకోవాలని చూస్తోంది టీ బీజేపీ. మోదీ స్వాగత ఏర్పాట్లను బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
పీఎం మోదీ టూర్.. షెడ్యూల్..
1. మధ్యాహ్నం 1. 30 కి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్.
2. మధ్యాహ్నం 1. 45 వరకు ఎయిర్ పోర్ట్ పార్కింగ్‌లో స్టేట్ బీజేపీ లీడర్స్ తో మీటింగ్.
3. మధ్యాహ్నం 1. 50కి హెలికాఫ్టర్‌లో HCU హెలిప్యాడ్‌కి చేరిక.
4. రోడ్డు మార్గంలో గచ్చిబౌలి- ISBకి పీఎం మోదీ.
5. మధ్యాహ్నం 2. గం – 3. 15 గం మధ్య ISB వార్షికోత్సవంలో పీఎం మోదీ పాల్గొంటారు.
6. సాయంత్రం 4. గం తిరిగి బేగంపేట్ చేరిక.
7. సాయంత్రం 4 .15కు బేగంపేట్ నుంచి చెన్నైకి పీఎం మోదీ.
మోదీ టూర్- ట్రాఫిక్ రూట్ మ్యాప్..
పీఎం మోదీ హైదరాబాద్ టూర్ సందర్భంగా పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
1. లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వెహికల్స్.. HCU డిపో దగ్గర ఎడమవైపు తీసుకొని మసీద్ బండ కమాన్ చేరాలి. ఇక్కడ మళ్లీ లెఫ్ట్ టర్న్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వెళ్లాలి. ఇక్కడ మరో రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది.
2. విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు.. విప్రో జంక్షన్ దగ్గర ఎడమకు తిరిగి క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసుకోవాలి. ఆ తర్వాత హెచ్సీయూ బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.
3. విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి. ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ORR, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు.
4. కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్ 45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్ కు చేరుకోవాలి.
5. గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు.. గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి. బొటానికల్ గార్డెన్ దగ్గర లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, హెచ్సీయూ డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.