PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రేపు (మే 10న) తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పలు వరాలు ఇచ్చిన మోదీ.. ఆ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తూ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి..

PM Modi: తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర..!
Pm Modi

Updated on: May 09, 2026 | 10:53 AM

PM Modi: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు గచ్చిబౌలిలోని HIC సెంటర్‌లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!

ప్రధాని మోదీ ప్రారంభించే, శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల వివరాలు:

1. రహదారుల విస్తరణ (రూ.3,180 కోట్లు):

హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ (NH-167)లో భాగంగా గుడెబల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు నిర్మించనున్న 4-లేన్ల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇది తెలంగాణ – కర్ణాటక మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.

2. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (రూ. 2,360 కోట్లు):

పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తూ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

3. రైల్వే ప్రాజెక్టులు (రూ. 1,550 కోట్లు):

కాజీపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన వివిధ విభాగాల పనులను (రూ. 1,250 కోట్లు) ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
కాజీపేటలో రూ. 300 కోట్లతో నిర్మించిన రైల్ అండర్ రైల్ బైపాస్ లైన్ కూడా ప్రారంభం కానుంది.

4. పీఎం మిత్ర పార్క్ – వరంగల్ (రూ. 1,700 కోట్లు):

వరంగల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ‘PM మిత్ర పార్క్’ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్)ను ప్రధాని ప్రారంభిస్తారు. ఇది వస్త్ర పరిశ్రమ రంగంలో తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురానుంది.

5. గ్రీన్ ఫీల్డ్ POL టెర్మినల్ (రూ. 610 కోట్లు):

హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ POL టెర్మినల్‌ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు.

ముఖ్య అతిథులు:

ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, జి. కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులు తెలంగాణ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.

ఇది కూడా చదవండి: Suzuki Swift: హైడ్రోజన్ స్విఫ్ట్ కారు వచ్చేస్తోంది.. నితిన్ గడ్కరీ కలల ప్రాజెక్టు నెరవేరుతుందా?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us