PM Modi: సికింద్రాబాద్‌ ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

|

Sep 13, 2022 | 8:52 AM

Secunderabad fire accident: సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున సాయం ప్రకటించారు.

PM Modi: సికింద్రాబాద్‌ ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
Pm Modi
Follow us on

సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం నగరంలో విషాదాన్ని నింపింది. అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. ఇదిలావుంటే రూబీ లాడ్జ్‌ అగ్ని ప్రమాద ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జ్‌ ఓనర్ రంజిత్‌సింగ్‌ బగ్గాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బిల్డింగ్ అనుమతులు, బైక్స్‌ షోరూం, లాడ్జ్‌ నిర్వాహణ అనుమతులపై ఆరా తీసుకున్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పరిశీలిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. బైక్‌ బ్యాటరీ పేలుడు, షార్ట్‌ సర్క్యూట్‌ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మ‌ృతి చెందారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అపోలో, యశోద, గాంధీలో వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో రూబీ లాడ్జ్‌లో మొత్తం 25 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో అగ్నిప్రమాదం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో ఆ ప్రాంతం భారీ శబ్దాలతో దద్దరిల్లింది. చూస్తుండగానే మంటల్లో షోరూం కాలిపోయింది. దట్టమైన పొగ షోరూంపైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన టూరిస్ట్‌లు పొగకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కొందరు సజీవదహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.కొందరు ప్రాణ భయంతో పైనుంచి కిందకు దూకారు. కొందరు బిల్డింగ్‌కి ఉన్న పైప్‌ల సాయంతో కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్‌ షోరూం ఉంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గొడౌన్‌ ఉంది. ఈ-బైక్‌లు చార్జింగ్‌ పెట్టారు సిబ్బంది. సోమవారం రాత్రి 8.45 సమయంలో ఓ ఈ-స్కూటర్‌ బ్యాటరీ పేలిపోయింది. క్షణాల్లో అన్ని వెహికల్స్‌ బ్యాటరీలు భారీ శబ్దంతో పేలుతూ మంటల్లో కాలిపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు గొడౌన్‌లో ఎవరూ లేరు. కానీ దట్టమైన పొగ పైఅంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్‌ గదులకు మంటలు వ్యాపించాయి. రూమ్స్‌లో ఉన్నోళ్లు ఉన్నట్టే ఊపిరాడక ప్రాణాలు వదిలేశారు. హాస్పిటల్స్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు మరికొందరు. దీంతో ఎనిమిది మంది చనిపోయేందుకు కారణంగా మారింది.

ఛార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైక్ నుంచి మొదలు..

సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సెల్లార్‌లోని ఎలక్ట్రిక్‌ బైక్స్‌కి ఛార్జింగ్‌ పెట్టారు షోరూమ్‌ సిబ్బంది. టైమ్‌, రాత్రి 9గంటలవుతోంది. అప్పుడు బాంబులా పేలిపోయింది ఓ బ్యాటరీ. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి మొత్తం యాభై బైక్స్‌… సీరియల్‌ బాంబుల్లా భారీ శబ్దంతో బ్లాస్ట్‌ అయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే హోటల్ మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం