Nizamabad Collector Narayana Reddy: కరోనావైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి సృష్టిస్తోంది. ఈ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సైతం.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతోపాటు కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వైద్య సిబ్బంది సూచనలు చేస్తున్నారు. కరోనా కట్టడికి అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని నిజామాబాద్ కలెక్టర్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉందని, ‘చేతులెత్తి దండం పెడుతున్నా.. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోండి’ అంటూ నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజకు సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు ఒక ఆడియో సందేశాన్ని పంపారు. జిల్లాలో ఇంకా లక్షన్నర మంది మొదటి డోస్ తీసుకోలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌తో రోగనిరోధకశక్తి పెరిగి థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవచ్చంటూ ఆయన తెలిపారు. లేదంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చినవారమవుతామని.. దయచేసి వ్యాక్సిన్ తీసుకోండంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ప్రజలను అప్రమత్తం చేస్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో నారాయణ రెడ్డి టీవీ9తో మాట్లాడారు. మూడవ వేవ్ ముప్పు ఒమిక్రాన్ రూపంలో పోంచిఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ కు సంబంధించి రెండు శాంపిల్స్‌ను మహరాష్ట్రలో టేస్ట్ కు పంపిన నేఫథ్యంలో సరిహద్దు జిల్లా కావడంతో ఇక్కడ కూడ అలెర్ట్ గా ఉన్నామన్నారు. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారని.. దీనినుంచి బయటపడాలంటే తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. దాదాపు 14 శాతం మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదని, వీరంతా లక్షన్నర వరకు ఉంటారని తెలిపారు. అందుకే ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ సూచనలు చేస్తున్నానని.. ఆడియో సందేశంతో ప్రజలను విజ్నప్తి చేస్తున్నానని కలెక్టర్ నారయణ రెడ్డి పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోని వారిని వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు.
నారాయణ రెడ్డి ఆడియో సందేశం..
Also Read: