Parties Secret Formula: అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఫ్లాన్.. ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు రెండు జాతీయ పార్టీల సీక్రెట్ ఫార్ములా..?

|

Jun 29, 2021 | 5:05 PM

వరుసగా అధికారానికి దూరమై విపక్షంలోనే కూర్చున్నప్పుడు పాదయాత్ర చేస్తే అదే గెలుపుబాటగా మారుతుందన్న సెంటిమెంట్‌ కాంగ్రెస్‌లో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Parties Secret Formula: అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఫ్లాన్.. ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు రెండు జాతీయ పార్టీల సీక్రెట్ ఫార్ములా..?
Political Parties Plan For Assembly Elections 2023
Follow us on

Political Parties Plan for Assembly Elections 2023: ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సక్సెస్ ఇస్తున్న పాదయాత్రల సీన్ ఇప్పుడు తెలంగాణలోనూ ట్రెండ్ కాబోతోందా.. ! చూడబోతే అలాగే కనిపిస్తోంది. వరుసగా అధికారానికి దూరమై విపక్షంలోనే కూర్చున్నప్పుడు పాదయాత్ర చేస్తే అదే గెలుపుబాటగా మారుతుందన్న సెంటిమెంట్‌ కాంగ్రెస్‌లో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ఎంపికయ్యారో లేదో.. ఈ టాక్ ఇప్పుడు హాట్‌ హాట్‌గా మారిపోయింది.

రేవంత్‌ రెడ్డికి పాదయాత్ర కొత్తకాదు. కొద్దిరోజుల క్రితం ఆయన జడ్చర్ల నుంచి హైదరాబాద్ వరకూ పాదయాత్ర చేశారు. అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పర్మిషన్ లేదన్న వాదన కూడా వినిపించింది. గుసగుసలాడేవాళ్లు.. గుసగుసలాడారు. రుసురుసలాడేవాళ్లు.. రుసరుసలాడారు. ఆయన మాత్రం అడుగులో అడుగేసుకుంటూ హైదరాబాద్ నడుచుకుంటూ వచ్చేశారు.

రేవంత్‌కి ఆ పాదయాత్ర ఇచ్చిన ఫస్ట్ సక్సెస్ ఏమోగానీ.. ఇప్పుడు ఏకంగా టీపీసీసీకి చీఫ్‌ అయిపోయారు. ఇక మిగిలింది అధికారమే ! అందుకే ఆయన పార్టీకి సారథికాగానే మళ్లీ పాదయాత్ర టాపిక్ వచ్చేసింది. ఆయన కూడా ఎక్కడా ఖండిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అంటే ఆయన ఆ ప్రయత్నం కచ్చితంగా చేస్తారన్నదే ప్రస్తుతానికి ఉన్న నమ్మకం. 2023లో ఎన్నికలు కాబట్టి.. 2022లో కాళ్లకు పనిచెబుతారని తెలుస్తోంది. ఈలోపు పార్టీలో నేతలను బుజ్జగించో, బతిమాలో, అధికారం చూపించో దారికి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్‌.

పాదయాత్ర ఇంత సక్సెస్ ఫార్ములా అయితే.. భారతీయ జనతాపార్టీ మాత్రం ఎందుకు వదులుకుంటుంది. ఆ పార్టీదీ అదే బాటగా కనిపిస్తోంది. పైగా రేవంత్‌ అడుగు బయటపెడతారని పక్కా సమాచారం అందగానే వాళ్లు కూడా సై అనేలా కనిపిస్తున్నారు. రేవంత్‌ రెడీ అని ప్రకటించగానే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

రాష్ట్ర స్థాయి యాత్రకు ముహూర్తం తర్వాత ఫిక్స్ చేసుకుందాం అనుకున్న బీజేపీ ముందుగా హుజూరాబాద్‌ ఎలక్షన్ కోసం ఓ శాంపిల్ యాత్రను చేయబోతున్నట్లు కూడా టాక్. మొత్తంగా తెలంగాణలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఓడించడానికి రెండు జాతీయ పార్టీలూ పాదయాత్రకు సిద్ధం అవుతున్నాయన్నది ప్రస్తుతానికి సీక్రెట్ టాక్.

Read Also… Supreme Court : తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు కోర్టు ధిక్కరణ నోటీసులు