Phone Tapping: మా ఫోన్లు ట్యాప్ చేశారు మహాప్రభో.. పోలీసులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

| Edited By: Balaraju Goud

Apr 04, 2024 | 11:22 AM

రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరిలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాదాకిషన్ రావు తోపాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రాష్ట్రమంతా వ్యాపించడంతో పలువురు నేరస్తులు సైతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Phone Tapping: మా ఫోన్లు ట్యాప్ చేశారు మహాప్రభో.. పోలీసులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
Dcp Radhakishan Rao
Follow us on

రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేక కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అడిషనల్ ఎస్పీలను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరిలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాదాకిషన్ రావు తోపాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రాష్ట్రమంతా వ్యాపించడంతో పలువురు నేరస్తులు సైతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ ఫోన్లను టాప్ చేసి ఇప్పుడు అరెస్ట్ అయిన అధికారులు వేధింపులకు గురి చేశారని ఒక్కొక్కరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఉదాంతం బయటికి రాగానే సైబరాబాద్ పరిధిలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. నిర్మాణపరంగా సెటిట్‌మెంట్ కోసం తన వ్యతిరేకులకు లబ్ధి చేకూర్చేందుకు శ్రీధర్ అనే వ్యాపారి ఫోన్ ట్యాప్ చేయించారని కొద్దిరోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు తోపాటు రాధాకిషన్ రావుకు సంబంధం ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించి ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కు రప్పించారు. శ్రీధర్ అనే వ్యాపారవేత్తపై ఇప్పటికే మూడు కమిషనరేట్ల పరిధిలో అనేక కేసులు ఉండటం విశేషం. పలు కన్వెన్షన్ హాల్స్ నిర్వహించే శ్రీధర్‌పై సైబరాబాద్ కమిషనరేట్‌లో అధిక కేసులు ఉన్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ ఉదాంతం బయటపడటంతో తన ఫోన్లను టాప్ చేసి మరి బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఇక ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ సైతం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందని దీని వెనకాల ఇప్పుడు అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు హస్తం ఉందని ఆయన డీజీపీ రవి గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి తనను భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా కేసు బదలాయించారని, రాధా కిషన్ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నందకుమార్ డీజీపీ రవి గుప్తాను కలిసి విన్నవించుకున్నారు.

ఇక తాజాగా క్యాసినో రారాజు చికోటి ప్రవీణ్ సైతం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గజ్వేల్‌లో హిందువుల తరఫున పోరాడేందుకు వెళ్లానన్న అక్కసుతో తన ఫోన్ టాప్ చేసి, రాధా కిషన్ రావు బెదిరించాడని ఆయన తెలిపాడు. గతంలో అనేకసార్లు తనను కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇవ్వాలని ఆయన బెదిరించినట్లు చికోటి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ విధంగా ఫోన్ టాపింగ్ ఉదాంతంతో గతంలో కేసులు నమోదై అరెస్ట్ అయిన పలువురు చీటర్స్ ఫోన్లను ట్యాప్ చేశారని పోలీసులను ఆశ్రయించడం విశేషం. అయితే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సైతం తమ ఫోన్లను టాప్ చేశారని పోలీసులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయ ఫిర్యాదులు, మరోవైపు క్రిమినల్స్ ఫిర్యాదులతో ప్రస్తుత దర్యాప్తు అధికారులు యమాబిజీగా ఉంటున్నారు. మరి వీరి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నదీ వేచిచూడాలి..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..