Petrol and diesel prices: నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా..

|

Dec 31, 2020 | 10:19 AM

Petrol and diesel prices: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా కొనసాగుతున్నాయి. పెద్దగా మార్పులేమి కనిపించడం లేదు. కాగా వివిధ

Petrol and diesel prices: నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా..
Follow us on

Petrol and diesel prices: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా కొనసాగుతున్నాయి. పెద్దగా మార్పులేమి కనిపించడం లేదు. కాగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో.. లీటరు పెట్రోల్ ధర రూ.83.71 ఉండగా డీజిల్ ధర రూ.73.87 గా ఉన్నాయి. ఇక ఆర్థిక నగరం ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.90.34 ఉండగా డీజిల్ ధర రూ.80.51 గా ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.87.06 కాగా డీజిల్ ధర రూ.80.60 గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ రూ.86.65, డీజిల్ రూ.80.21, కరీంనగర్‌లో పెట్రోల్ రూ.87.59, డీజిల్ రూ.81.09, ఖమ్మంలో పెట్రోల్ రూ.88.02, డీజిల్ రూ.81.47, ఆదిలాబాద్‌లో పెట్రోల్ రూ.89.26, డీజిల్ రూ.82.64 గా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ.88, డీజిల్ ధర రూ.82.07, గుంటూరులో పెట్రోల్ ధర రూ.90.16, డీజిల్ ధర రూ.83.18, అనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.89.29, డీజిల్ ధర రూ.82.40 ,చిత్తూరు లీటరు పెట్రోల్ ధర రూ.90.55, డీజిల్ ధర రూ.83.51 గా ఉన్నాయి.