Mancherial District: గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా (China Manja) అస్సలు ఉపయోగించొద్దంటూ పదపదే ప్రభుత్వ అధికారులు సూచిస్తుంటారు. అంతేకాకుండా చైనా మాంజా విక్రయాలపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. అయినప్పటికీ.. చైనా మాంజా మార్కెట్‌లల్లో ఇంకా విచ్చలవిడిగా లభిస్తూనే ఉంది. చైనా మాంజా కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. తాజాగా మరో ప్రాణం కూడా పోయింది. గాలి పటానికి ఉన్న (చైనా మాంజ) దారం తగిలి ఓ వ్యక్తి గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన సంక్రాంతి పండుగ రోజున తెలంగాణలోని మంచిర్యాల జిల్లా (Mancherial District) లో చోటుచేసుకుంది.
పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న దంపతులకు (kite) గాలిపటం (చైనా మాంజ) దారం తగిలింది. ఆ దారం మెడకు చుట్టుకోవడంతో భీమయ్య గొంతు కోసుకోని పోయింది. దీంతో భీమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా గొల్లపల్లిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read;