Hyderabad: హైదరాబాద్ లో బైక్ రేసింగ్ కల్చర్.. ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్.. అంతే కాకుండా

|

Apr 11, 2022 | 10:18 AM

రోడ్డు పై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అంతా రోడ్డున పడాల్సి వస్తుందన్న వాస్తవాన్ని...

Hyderabad: హైదరాబాద్ లో బైక్ రేసింగ్ కల్చర్.. ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్.. అంతే కాకుండా
Bike Racing Culture
Follow us on

రోడ్డు పై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అంతా రోడ్డున పడాల్సి వస్తుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ హైదరాబాద్(Hyderabad) నగరంలో కొందరు యువకులు సాహసాలకు పాల్పడుతున్నారు. బైక్ రేసింగ్(Bike Racing) కల్చర్ తో రోడ్లపై రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి,అపరాత్రి అనే తేడా లేకుండా రాత్రుళ్లు బైక్ పై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. తెల్లవారుజాము వరకు రేసింగ్ లకు పాల్పడుతూ వీరంగం సృష్టిస్తు్న్నారు. సోషల్ మీడియాలో(Social Media) ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతి వేగంగా రోడ్లపై 100 నుంచి 150 వాహనాలతో రేస్ లకు పాల్పడి స్టంట్ లు చేస్తూ రోడ్లపై ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ చంచల్ గూడ రోడ్డు పై బైక్ రేసర్లు పేట్రేగిపోతున్నారు. ఈ చంచల్ గూడా జైలు రోడ్ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. సమాచారం అందుకున్న సైదాబాద్, మాదన్నపేట, డబీర్ పురా, చాదర్ ఘాట్ పోలీసులు అక్కడకు చేరుకుని రెండు వాహనాలు, కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా వుండే చంచల్ గూడ జైల్ రోడ్డులో యువకుల బైక్ స్టంట్స్ అందరిని హడలెత్తిస్తోంది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

– నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్

Also Read

Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. అచ్చతెలుగు మకరందం.. గుర్తుపట్టండి..

Covid-19: దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Skin Care Tips: వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే.. ఈ ఫేస్ మిస్ట్‌లను ట్రై చేయండి..