ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..

వర్షకాలం మొదలైనా కూరగాయల ధరలు మండిపోతున్నాయి...సామాన్యుడికి‌ అందుబాటులో లేకుండా కూరగాయల ధరలు పెరిగిపోయాయి... దాదాపు నా అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి దగ్గరగా‌ ఉన్నాయి. ఈ‌సీజన్‌లో అందరికి‌ అందుబాటులో ఉండే అకుకూరల ధరలు కుడా పెరిగిపోయాయి.

ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..
Vegetables Prices

Edited By:

Updated on: Jun 30, 2024 | 10:49 AM

వెజిటబుల్స్ సామాన్యులకు వెజిట్రబుల్స్‌గా మారాయి. మార్కెట్‌లో కూరగాయలు సెంచరీ కొడుతున్నాయి. మార్కెట్‌లో ఏం కొందామన్నా సెంచరీకి దగ్గర్లోనే ఉన్నాయి. మొన్నటిదాకా టమోటా రేట్లు మోత మోగిస్తే.. ఇప్పుడు పచ్చిమిర్చి, చిక్కుడు, క్యారెట్, కాకరకాయ సహా అన్ని కూరగాయలు సెంచరీకి చేరువలో ఉన్నాయి. ఐదు వందల రూపాయలు తీసుకుని మార్కెట్‌కి వెళ్తే కనీసం రెండు మూడు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు.

వర్షకాలం మొదలైనా కూరగాయల ధరలు మండిపోతున్నాయి…సామాన్యుడికి‌ అందుబాటులో లేకుండా కూరగాయల ధరలు పెరిగిపోయాయి… దాదాపు నా అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి దగ్గరగా‌ ఉన్నాయి. ఈ‌సీజన్‌లో అందరికి‌ అందుబాటులో ఉండే అకుకూరల ధరలు కుడా పెరిగిపోయాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సరైన వర్షాలు కురియలేదు … ఇప్పటి కీ భారీ వర్షాలు కురియలేదు.దీనితో కూరగాయల సాగు పైనా ప్రభావం చూపింది..గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది…చాల చొట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.ప్రస్తుతం ‌బహిరంగ‌ మార్కెట్ లో అన్ని రకాల ‌కూరగాయాల ధరలు నలభై శాతం ‌వరకి పెరిగాయి..పచ్చి మిర్చి కిలోకి 90..చిక్కడు కిలో కి నూట ఇరవై,క్యారెట్ వంద,కాకరకాయ తొంభై ,కాలిఫ్లవర్ ఎనభై, అకుకూరలు కిలొకి డెబ్భై రూపాయల వరకి ధర పలుకుతుంది..

ఇవి కూడా చదవండి

గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు ‌కొనుగోలు చెస్తే వారం రొజులకి సరిపడేది.ఇప్పుడు ‌కనీసం రెండు రోజులకి కూడ సరిపోవడం లేదు..ఈ‌ధరలు మరింత పెరిగే అవకాశం వుందని వ్యాపారస్తులు చెబుతున్నారు… కొత్త పంట చేతికి వచ్చేంత వరకి‌ ధరలు సామాన్యడికి అందుబాటులో ఉండవు. ఇప్పటికి ఎండ తీవ్రత ఉంది.దింతో.. కొత్త పంట సాగు చేయడం కష్టంగా మారింది. వర్షాలు కురియక పోతే.. కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us