పెద్దపల్లిలో జనంను వణికిస్తున్న క్షుద్రపూజలు

| Edited By:

Mar 08, 2019 | 11:59 AM

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజల భయంతో జనం వణికిపోతున్నారు. ఆది, గురు వారాలు వచ్చాయంటే.. చీకటి పడితే.. గడప దాటాలంటే భయపడిపోతున్నారు. మూడు దారులు, నాలుగు రోడ్ల కూడలి దగ్గర నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయ, మేకులు, జీడిగింజలు, అన్నంముద్దలు, బొమ్మలు పెట్టి పూజలు చేసిన ఆనవాళ్లు.. స్థానికులను వణికిస్తున్నాయి. అమావాస్య వచ్చిందంటే మరీ ఎక్కువగా ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రాత్రి పూటే జరుగుతున్నాయి. అమావాస్య రోజున నల్లకోడిన చంపి.. నాలుగు రోడ్ల కూడలి దగ్గర పడేస్తున్నారు. […]

పెద్దపల్లిలో జనంను వణికిస్తున్న క్షుద్రపూజలు
Follow us on

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో క్షుద్రపూజల భయంతో జనం వణికిపోతున్నారు. ఆది, గురు వారాలు వచ్చాయంటే.. చీకటి పడితే.. గడప దాటాలంటే భయపడిపోతున్నారు. మూడు దారులు, నాలుగు రోడ్ల కూడలి దగ్గర నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయ, మేకులు, జీడిగింజలు, అన్నంముద్దలు, బొమ్మలు పెట్టి పూజలు చేసిన ఆనవాళ్లు.. స్థానికులను వణికిస్తున్నాయి. అమావాస్య వచ్చిందంటే మరీ ఎక్కువగా ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రాత్రి పూటే జరుగుతున్నాయి. అమావాస్య రోజున నల్లకోడిన చంపి.. నాలుగు రోడ్ల కూడలి దగ్గర పడేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా.. అనారోగ్యానికి గురైతే.. వారి పై నుంచి తిప్పి ఇలా చేస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.