పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఏపీలోని నేషనల్ హైవేస్‌పై ఏప్రిల్ 1 నుంచి టోల్ ఫీజుల రూపంలో వాహనదారులకు బాదుడు షురూ అవ్వనుంది. రాష్ట్రంలో టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఫైనల్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. హైవేలపై తిరిగే అన్ని రకాల వాహనాల టోల్ ఛార్జీలను ఎన్‌హెచ్‌ఏఐ సవరించినట్లుగా సమాచారం అందుతుంది. సవరించిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.
ఏపీలో అన్ని నేషనల్ హైవేస్‌పై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ప్రస్తుతం రోజుకు సగటున రూ.6.6 కోట్ల వరకు టోల్ వసూలవుతోంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.2,409 కోట్ల వరకు వస్తోంది. పెంచిన టోల్ ఛార్జీలతో ఈ మొత్తం ఇంకా పెరగనుంది.
Also Read: ఒంట్లో బాలేదంటూ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. ఆస్పతికి తీసుకువెళ్లగా పిడుగులాంటి వార్త