
శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణీకుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు.
మహాశివరాత్రి కావడంతో ఉపవాస దీక్షలతో ఉన్న ప్రయాణికులు పుణ్యస్నానాలు అచరించేందుకు వారణాసి వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భక్తులు. బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లారు. చివరి నిమిషంలో ఫ్లైట్ సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ సమాచారం ఇచ్చారు. దీంతో ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది సరియైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఉదయం 10 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ వెళ్ళాక పోవడం తో ఆందోళన వ్యక్తం చేశారు. గంటల తరబడి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు ఆచరించడానికి చివరి రోజు కావడంతో భక్తులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే 144 ఏళ్లకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని 48 వేల రూపాయలు పెట్టిన ఒక్కొక్క టికెట్స్ కొనుగోలు చేసామని ప్రయాణీకులు గోడు వెళ్లబోసుకున్నారు. కనీసం మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడంటూ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు హంగామా సృష్టించారు. ఎయిర్ లైన్స్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో అధికారులైన ప్రత్నామ్యాయ ఎర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..