Parigi MLA Mahesh Reddy: ఊరికి రోడ్డు కావాలంటే.. రైతు బంధు, పెన్షన్లు వదులుకోండి.. నాలిక్కరుచుకున్న పరిగి ఎమ్మెల్యే!

ఆవేశంలో అన్నారో , ఆలోచనలో అన్నారో తెలీదు కానీ, వర్షాలకు రోడ్డు పాడైపోయింది సారూ !.. బాగు చేయించమని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇచ్చిన సమాధానం...

Parigi MLA Mahesh Reddy: ఊరికి రోడ్డు కావాలంటే.. రైతు బంధు, పెన్షన్లు వదులుకోండి.. నాలిక్కరుచుకున్న పరిగి ఎమ్మెల్యే!
Parigi Mla Mahesh Reddy

Updated on: Jul 09, 2021 | 8:31 AM

Parigi MLA Mahesh Reddy Sensational Comments: ఆవేశంలో అన్నారో , ఆలోచనలో అన్నారో తెలీదు కానీ, వర్షాలకు రోడ్డు పాడైపోయింది సారూ !.. బాగు చేయించమని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో దెబ్బకు గ్రామస్తుల మైండ్ బ్లాక్ అయింది. ఇంతకూ ఆయన చెప్పిందేమిటంటే..

వికారాబాద్ జిల్లా పూడురు మండలంలోని పలు గ్రామాల్లో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. పూడురు అనుబంధ గ్రామమైన మైసమ్మ గడ్డ తాండా వాసులు ఎన్నికలప్పుడు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని.. వర్షం పడితే గ్రామానికి రాకపోకలు ఇబ్బంది అవుతోందని, తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేను కోరారు. అయితే, అంత పెద్ద మొత్తం నిధులు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే చెప్పారు. అయినా శాంతించని కొందరు రోడ్డు కావాలంటూ గట్టిగా అడిగారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. మీ ఊరికి రోడ్డు కావాలంటే రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ వదులుకోండి.. వెంటనే ఊరికి రోడ్డు వేయిస్తానని బదులిచ్చారు. అంతే! ఈ సమాధానంతో గ్రామస్తులకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. పాపం ఏమీ అర్థం కాని కొద్దిమంది ఆశ్చర్యంతో కూడిన కంగారు వల్ల వచ్చిన అయోమయం లుక్స్‌ ఇస్తే, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. ప్రభుత్వం వద్ద పైసలు లేవు.. మరి ఏం చేయాలే. తర్వాత వేయిస్తాలే.. అంటూ తన సమాధానాన్ని సరిచేసే యత్నం చేసారు. మరి ఆయన చెప్పినట్టు నిజంగానే పైసల్‌ లేవా? అయితే అవన్నీ ఆర్భాట ప్రకటనలేనా ? ఏది ఏమైనా జనాల్లో తిరిగేటప్పుడు , వారితో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకోండి సారూ !

Read Also… Hyderabad: కిలాడీ దంపతులు.. ఫేస్‌బుక్‌లో ప్రేమ, ఉద్యోగాల పేరుతో వల.. వెలుగులోకి భారీ మోసం..