New Traffic Rules: మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి

|

Mar 20, 2021 | 11:52 AM

మీ కొడుకు మైనరా.. వాహనాలు నడిపే అలవాటుందా.. అయితే జాగ్రత్త. అతనికి వాహనం ఇచ్చే ముందు.. మీరు జైలుకు సిద్దమైతేనే ఇవ్వండి. అవును నిబంధనలు కఠినతరం అయ్యాయి.

New Traffic Rules:  మీ కొడుకు మైనరైనా వాహనం ఇస్తున్నారా..? అయితే మీరు కూడా జైలుకు సిద్దమవ్వండి
Minor Driving
Follow us on

Warangal Police Commissioner: మీ కొడుకు మైనరా.. వాహనాలు నడిపే అలవాటుందా.. అయితే జాగ్రత్త. అతనికి వాహనం ఇచ్చే ముందు.. మీరు జైలుకు సిద్దమైతేనే ఇవ్వండి. అవును నిబంధనలు కఠినతరం అయ్యాయి.

యాక్సిడెంట్ల నివారణకు కఠిన చర్యలు తప్పదని పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసుల బాటలోనే వరంగల్‌ పోలీసులు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చారు. రోడ్డుపైకి వస్తే చాలు.. యువత వేగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చేతిలో బైకుకు బ్రేకులు కూడా వేయడాన్ని మరిచిపోతున్నారు. మెరుపు వేగంతో దూసుకుపోతుండడంతో.. ఇటీవల ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే చాలు.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని చెబుతున్నారు. అది కూడా ఆ వాహన యజమానికి శిక్ష విధిస్తామని చెబుతున్నారు. ఈ మేరకు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే అనార్ధాలను వివరిస్తూ.. 40 సెకండ్ల నిడివిగల వీడియోను విడుదల చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఇకపై మైనర్లు వాహనాలు నడుపుతూ దొరికితే.. వెంటనే దాన్ని సీజ్‌ చేసి.. దాని యజమానికి శిక్ష పడేలా చూస్తామని అంటున్నారు. మైనర్లకు టూవీలర్లు, ఫోర్‌ వీలర్లు ఇస్తూ ప్రోత్సహించే వారికి ఈ శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. మైనర్ల డ్రైవింగ్‌తో తల్లిదండ్రులకు కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ చిన్నారులకు వాహనాలను అందజేయవద్దని పోలీసులు కోరుతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో వాహనం నడపడం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతర వాహనదారులు సైతం ప్రమాదం బారిన పడే ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు. చిన్నారులను చదువుల్లో రాణించేలా ప్రోత్సహించాలని… కానీ వాహనాలు ఇచ్చి కాదని సూచిస్తున్నారు.

Also Read: ‘ఆ అమ్మాయి నాది’ అని బెదిరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు.. ఆగిపోయిన పెళ్లి.. కట్ చేస్తే.. వన్‌ సైడ్‌ లవ్‌ అట

Kadapa district: రోజుకు 48 బాటిల్సే.. సీసా అందుకుంటే ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్.. ఏంటి గురూ ఇది

 

ఎమ్మెల్సీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి: