Operation Tiger: మళ్లీ వచ్చిన మ్యాన్ ఈటర్.. రెండవ దశ రెస్క్యూ ఆపరేషన్‌కు సిద్ధమైన అధికారులు.. ఈసారైనా పట్టుకుంటారా?

|

Jan 31, 2021 | 5:13 PM

Operation Tiger: కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి సంచరించడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.

Operation Tiger: మళ్లీ వచ్చిన మ్యాన్ ఈటర్.. రెండవ దశ రెస్క్యూ ఆపరేషన్‌కు సిద్ధమైన అధికారులు.. ఈసారైనా పట్టుకుంటారా?
Follow us on

Operation Tiger: కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి సంచరించడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ సరిహద్దులను దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిపోయిందని భావించిన పులి.. తిరిగి రావడంతో మరోసారి దానిని బంధించేందుకు సిద్ధమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట్, బెజ్జూర్ మండలాల్లో మళ్లీ పెద్దపులి సంచరించింది. ప్రాణహిత నది, పెద్దవాగు నదుల పరివాహక ప్రాంతాల్లో సంచరించడాన్ని స్థానికులు చూశారు. దాంతో వారు బెంబేలెత్తిపోయారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. పులి సంచారించిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాని పాదముద్రలను పరిశీలించిన అధికారులు.. మ్యాన్ ఈటర్ మళ్లీ వచ్చిందిన నిర్ధారించారు.

ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు.. త్వరలోనే రెండో దశ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆ పెద్దపులి రాంపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. కాగా, జనవరి 18న కందిభీమన్న అటవీ ప్రాంతంలో మ్యా్న్ ఈటర్‌ను బంధించేందుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆ సమయంలో పులి మహారాష్ట్రవైపు వెళ్లిపోయింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ఉపసంహరించుకున్నారు. తాజాగా పులి మళ్లీ వచ్చింది. ఈ నెల 27వ తేదీన కందిగాం, కమ్మర్‌గా, అగర్ గూడలో సంచరించిన పెద్దపులి రాంపూర్ అటవి ప్రాంతంలో మూడు పశువులను చంపేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులిని ఈసారి ఎలాగైనా బందించాలని ఫిక్స్ అయ్యారు.

మొదటి దశలో ట్రంక్వైలేజ్ చేసి పులిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైందని, ఈసారి మాత్రం తప్పకుండా పట్టుకుంటామని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శాంతరాం అన్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో దిగిడ, మొర్రుగూడ, లోహా తో పాటు 35 గ్రామాలను అప్రమత్తం చేశామన్నారు. త్వరలోనే రెండవ దశ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పిన ఆయన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సమీపంలో గల పంట పొలాల్లోకి, పశువులను కాసేందుకు, వాగుల్లో చేపల వేటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పులిని పట్టుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని, వారి సహకారం లేకుంటే తాము ఏమీ చేయలేమని శాంతరాం అన్నారు. అయితే, ఈసారైనా ఆ మ్యాన్ ఈటర్‌ను ఫారెస్ట్ సిబ్బంది బందిస్తారో లేదో చూడాలి.

Also read:

Man Eater Hulchul: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మళ్ళీ మ్యాన్ ఈటర్ సంచారం.. భయాందోళనలో ప్రజలు

భర్తను హత్య చేసినా కుటుంబ పింఛనుకు భార్య అర్హురాలే, పంజాబ్, హర్యానా హైకోర్టు అనూహ్య తీర్పు