కాయ్ రాజా.. కాయ్.. దసరా ధమాకా ఆఫర్.. ఆ లక్కీ డ్రాలో మీ పేరెళ్లితే.. అబ్బో ఆ కిక్కే వేరబ్బా..! ఇప్పటివరకు ఎక్కడా కనివిని ఎరుగని ఆఫర్ ఇది..! దీంతో ఊరంతా ఎగేసుకుని మరీ సభ్యులుగా చేరుతున్నారు. ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే ఎలాంటి వారైనా షాక్ అవ్వాల్సిందే.. ఇంతకీ ఏంటా దసరా ధమాకా స్కీం ఏంటి అనుకుంటున్నారా..? ఈ న్యూస్ చదవండి..!
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామమంతా ఊదర గొడుతున్న ఈ దసరా ధమాకా ఆఫర్ ఏంటో తెలుసా.?
ఇలాంటి బంపర్ ఆఫర్లు ఎక్కడా చూసినట్లు లేదు కదూ..! ఉప్పల్ గ్రామం అంతా ఫ్లెక్సీలతో ఉదరగొడుతున్న బంపర్ ఆఫర్ ఇది. చూస్తుంటే విచిత్రంగా ఉంది కదూ. దసరా పండుగను పురస్కరించుకుని ఉప్పల్ గ్రామంలో యువకులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను సందర్భంగా కొంతమంది యువకులు ఒక వినూత్నమైన లక్కీడ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ లక్కీ డ్రా ద్వారా మీ లక్కు పరీక్షించుకోవాలంటే వంద రూపాయలు చెల్లించి మీ పేరు నమోదు చేసుకోవాలి. నిర్వాహకులు మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్స్ అన్నీ కలిపి గ్రామస్తుల సమక్షం లో లక్కీ డ్రా తీస్తారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా మేకపోతు, ద్వితీయ బహుమతి గా గొర్రె పోటేలు, తృతీయ మద్యం బాటిల్స్, ఆ తర్వాత కోడి పుంజు ఇతర బహుమతులు అందజేస్తారు.
దసరా సందర్భంగా ఉప్పల్ యువకుల వినూత్న లక్కీ డ్రా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. దసరాకు ఒకరోజు ముందే ఈ లక్కీ డ్రా తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..