Hyderabad: బీకేర్‌ఫుల్..! హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగతనాలు.. బైక్ కొంటానని వచ్చి..

దొంగలు రోజురోజుకూ కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. జనాలు కూడా వాటిని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది.OLXలో వాహనం చూసి కొనుగోలు చేసేందుకని వచ్చిన ఓ వ్యక్తి.. వాహనాన్ని టెస్ట్ డ్రైవ్‌ కోసమని తీసుకెళ్లి అటు నుంచి అటే పారిపోయాడు. అతని ఎంతకీ రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: బీకేర్‌ఫుల్..! హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగతనాలు.. బైక్ కొంటానని వచ్చి..
Olx Scooter Scam

Edited By:

Updated on: Mar 21, 2026 | 4:00 PM

హైదరాబాద్ గాజులరామారం ప్రాంతంలో ఓఎల్ఎక్స్‌ ద్వారా స్కూటీ కొనుగోలు పేరుతో మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. OLXలో వాహనాన్ని చూసిన వ్యక్తి కొనుగోలు చేసేందుకు యజమాని దగ్గరకు వచ్చాడు. వాహనాన్ని టెస్ట్‌ డ్రైవ్‌ కోసమని తీసుకెళ్లి.. అటు నుంచి అటే వాహనంతో పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వల్లభాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న బి. సద్గుణ్‌ అనే వ్యక్తి తన హోండా ఆక్టివా స్కూటీని అమ్ముతానంటూ ఓఎల్ఎక్స్‌లో ప్రకటన పెట్టాడు.

OLXలో ఈ ప్రకటనను చూసిన ఓ వ్యక్తి కొనుగోలుదారుడిగా సద్గుణ్‌ను సంప్రదించి, వాహనాన్ని పరిశీలించిన అనంతరం టెస్ట్‌ డ్రైవ్‌ కోసమని తీసుకెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సద్గుణ్ జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితుడిని అప్పారి విశ్వ ఫణీంద్రగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో అతడు ఒంగోలు రమేష్‌ అనే వ్యక్తితో కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఓఎల్ఎక్స్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికలలో ప్రకటనలు పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుని, టెస్ట్‌ డ్రైవ్‌ పేరుతో వాహనాలు తీసుకుని తర్వాత వాటిని అమ్మేసేవారని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రెండో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us