మంచిర్యాల జిల్లా రాజకీయం.. ఇప్పుడు రాజధానికి చేరింది. టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు… కాంగ్రెస్‌లో చేరడంతో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మేల్యే నల్లాల ఓదెలు (Nallala Odelu) ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓదెలు ప్రభుత్వ విప్ ఉండగా మినిస్టర్ క్వార్టర్స్‌లో ఇంటిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఆ ఇంటిలోనే ఉంటున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీలో ఉన్నంత వరకు క్వార్టర్స్‌లోనే ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించారు. ఇటీవల ఓదెలు ఆయన భార్య జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ కండువకప్పుకున్నారు. దీంతో వారు వెంటనే క్వార్టర్ ఖాళీ చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓదెలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము ఇంట్లో లేని సమయంలో కొందరు అధికార పార్టీ నేతలు హంగామా చేశారని ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం