Mulugu: అడవిలో భారీ మనిషి ఆకారంలో కనిపించిన బొమ్మ.. దగ్గరకు వెళ్లి చూడగా..

ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రం శివారులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మందగడ్డ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి క్షుద్ర పూజలు జరిపారు. ఉదయానే అటువైపు పొలం పనులకు వెళ్లిన స్థానికులు అత్యంత భయంకరంగా నిర్వహించిన క్షుద్రపూజల ఆనవాళ్లు చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

Mulugu: అడవిలో భారీ మనిషి ఆకారంలో కనిపించిన బొమ్మ.. దగ్గరకు వెళ్లి చూడగా..
Occultism

Edited By:

Updated on: Jun 23, 2025 | 8:53 PM

ములుగు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మందగడ్డ అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమతో భారీ రూపంలో మనిషి ఆకారంలో ముగ్గు వేసి అందులో రక్తార్పణం చేశారు. అంతేకాకుండా ముగ్గులో నాలుగు కాళ్ల జంతువులు బలి ఇచ్చిన ఆడవాళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ క్షుద్రపూజలు ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.

అయితే ఆదివారం అర్ధరాత్రి ఈ పూజలు నిర్వహించినట్లు స్థానికులు భావిస్తున్నారు.. శత్రు పీడ వినాశనం కోసం చేశారా..! లేక ఎవరికైనా అనారోగ్య సమస్యల నుండి విముక్తి కోసం క్షుద్రపూజలు చేశారా. లేక ఎవరినైనా భయపెట్టించడం కోసం ఇలాంటి పూజలు చేశారో ఆర్థం కావట్లేదని స్థానికులు చెబుతున్నారు.

వీడియో చూడండి..
occult rituals are terrorizing locals in mulugu district

ఇక్కడ క్షుద్ర పూజలు ఆనవాళ్లు చూసిన స్థానికులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు.ఇక ఈ విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో ఇలాంటి భయానక చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..