Telangana: వంకర బుద్ధిని మానుకోని ఎస్సై.. తిక్క కుదుర్చిన ఉన్నతాధికారులు..!

మహిళలు, పిల్లలకు వేధింపులు లేకుండా పోలీసులు రక్షణగా ఉంటారు. అలాంటి పోలీసులే భక్షులుగా మారుతున్నారు. మహిళలే కాదు ఖాకీ చొక్కా వేసుకున్న మహిళలకు కూడా రక్షణ కరువైంది. కామంతో కళ్లు మూసుకుపోయి.. మహిళలకు ఆసరాగా ఉండే మహిళా కానిస్టేబుళ్లను ఓ ఎస్ఐ వేధించాడు. చివరికి ఆ ఎస్ఐకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Telangana: వంకర బుద్ధిని మానుకోని ఎస్సై.. తిక్క కుదుర్చిన ఉన్నతాధికారులు..!
Nutankal Si Suspended

Edited By:

Updated on: Aug 17, 2025 | 1:46 PM

మహిళలు, పిల్లలకు వేధింపులు లేకుండా పోలీసులు రక్షణగా ఉంటారు. అలాంటి పోలీసులే భక్షులుగా మారుతున్నారు. మహిళలే కాదు ఖాకీ చొక్కా వేసుకున్న మహిళలకు కూడా రక్షణ కరువైంది. కామంతో కళ్లు మూసుకుపోయి.. మహిళలకు ఆసరాగా ఉండే మహిళా కానిస్టేబుళ్లను ఓ ఎస్ఐ వేధించాడు. చివరికి ఆ ఎస్ఐకి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఈయన పేరు ప్రవీణ్ కుమార్. ఈయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఎస్ఐగా పని చేశారు. ఆయన పనిచేసిన ప్రతి చోట వివాదాస్పదమే. పలు చోట్ల లైంగిక వేధింపుల ఆరోపణలతో బదిలీకి గురయ్యాడు. ఇటీవల సూర్యాపేట జిల్లా నూతనకల్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టాడు. అయినా తన వక్ర బుద్ధి మాత్రం మారలేదు. ఈ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు సదరు ఎస్ఐ అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్‌లతో ఆమెను వేధించాడు. మానసిక హింసను భరించలేకపోయిన ఆ మహిళా కానిస్టేబుల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సదరు ఎస్ఐని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..