Nagarjuna Sagar By Election : నోముల భగత్ 40 వేల మెజారిటీతో గెలుస్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగార్జున సాగర్ పట్టణంలో ఈ ఉదయం మంత్రి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. మంత్రి తలసాని వెంట, కరీంనగర్ మున్సిపల్ చైర్మన్ సునీల్ రావ్, షాప్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారన్న మంత్రి.. 2018 ఎన్నికల తర్వాత నేటి వరకు జానారెడ్డి నాగార్జున సాగర్ మొఖం చూడలేదని విమర్శించారు. “14 సంవత్సరాలు మంత్రిగా ఉన్న జానారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదు.. ప్రజలకు అందుబాటులో లేరు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఏం చేశారని ఉపఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేయాలో ఆ పార్టీ నేతలు చెప్పాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సుఖసంతోషాలతో ఉండాలి అనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 50 సంవత్సరాల ఈప్రాంత ప్రజల చిరకాల కోరిక నెల్లికల్లు లిఫ్ట్ ఏర్పాటు కలను TRS ప్రభుత్వం నెరవేరుస్తుంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతుంది. నాగార్జున సాగర్ డ్యాం పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు త్రాగు, సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. అనేక గ్రామాలకు సరైన రోడ్లు లేవు. అభివృద్ధి కోసం పనిచేస్తున్న TRS ను ప్రజలు ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు.” అని తన ప్రచారంలో కాంగ్రెస్ టార్గెట్ గా తలసాని విమర్శలు గుప్పించారు.
Read also : Sharmila : తెలంగాణలో ఇవాళ మరో కొత్త పార్టీ ఆవిర్భావం .. లోటస్‌పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన షర్మిల