Telangana: స‌మాజం ఎటు పోతుందో.. కానిస్టేబుల్‌ చావుబతుకుల్లో ఉంటే ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు..

కానిస్టేబుల్‌ హత్యను పోలీస్‌ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక టీమ్స్‌ను ఫామ్‌ చేసి నిందితుడి కోసం గాలిస్తోంది. కానిస్టేబుల్‌ హత్యపై నిజామాబాద్ సీపీ కీలక కామెంట్స్ చేశారు. తోటి మ‌నిషి ఆప‌ద‌లో ఉంటే క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం బాధ‌క‌రమని.. స‌మాజం ఎటో పోతుందో అర్థంకానీ ప‌రిస్థితి ఉందంటూ పేర్కొన్నారు.

Telangana: స‌మాజం ఎటు పోతుందో.. కానిస్టేబుల్‌ చావుబతుకుల్లో ఉంటే ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు..
Crime News

Updated on: Oct 19, 2025 | 8:53 AM

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. నిజామాబాద్‌ వినాయక్‌ నగర్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ హత్యకు గురయ్యాడు. వరుస బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని.. బైక్‌పై స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్‌ ప్రమోద్‌పై కత్తితో దాడి చేశాడు నిందితుడు. ఈఘటనలో తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడి దాడిలో ఎస్‌ఐ విఠల్‌ కు కూడా గాయాలు అయ్యాయి. హత్య అనంతరం నిందితుడు రియాజ్‌ పారిపోయాడు.

ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. రియాజ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీపీ ఆదేశాలతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50వేల రూపాయలు రివార్డు ప్రకటించారు సీపీ సాయిచైతన్య. కానిస్టేబుల్‌ మృతి దురదృష్టకరం అని సీపీ పేర్కొన్నారు.

సీసీఎస్ కానిస్టేబుల్‌ మృతితో తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయామన్నారు సీపీ సాయి చైతన్య. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రావాల్సిన బెన్‌ఫిట్స్‌ అలాగే డిపార్ట్‌మెంట్‌ తరపున ఆదుకుంటాం, అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీపీ సాయి చైతన్య..

వీడియో చూడండి..


తమ కండ్లముందే ఘోరం జ‌రుగుతున్న త‌మ‌కేం ప‌ట్టన‌ట్టుగా కొంద‌రు వ్యవ‌హారించారని.. కానిస్టేబుల్‌కు తీవ్ర ర‌క్తస్రావం అవుతున్న.. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారంటూ సీపీ సాయి చైతన్య ఆవేదన వ్యక్తంచేశారు. తోటి మ‌నిషి ఆప‌ద‌లో ఉంటే క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం బాధ‌క‌రం. స‌మాజం ఎటi పోతుందో అర్థంకానీ ప‌రిస్థితి ఉందంటూ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..