
వరకట్న దాహానికి మరో ఇళ్లాలు బలైంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెటే బాధలు, వేధింపులు భరించలేక ఒక వివాహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. బాసర మండలంలోని దొండపూర్ గ్రామానికి చెందిన మనోజ్‌కు నాందేడ్ జిల్లా బిలోలి తాలుకాలోని అజిని గ్రామానికి చెందిన మాధవి అనే యువతితో 2021లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలకు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా భర్త మద్యానికి బానిసయ్యాడు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అత్తింటి వారు ఇంకా అదనపు కట్నం కోసం మాధవిని వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఇదే విషయంపై మాధవి కుటుంబ సభ్యులు అత్తింటి వారితో పలు సార్లు మాట్లాడినా ఎలాంటి ఫలితం లేకపోయింది.
మళ్లీ మాధవిని వేధించడం మొదలు పెట్టారు. ఇక వేధింపులు భరించలేక పోయిన మాధవి సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి అత్తవారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. ఇంట్లో వేలాడుతూ కనిపించిన మాధవిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
అయితే బాధిత తల్లిదండ్రులు మాత్రం మాధవిని అత్తింటి వారే హత్య చేసి తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన కుమార్తె చావుకు కారణమైన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.