Ginger Cultivation: అల్లం పంటతో అద్భుత ఆదాయం.. అధిక దిగుబడితో ఆదర్శంగా నిలిచిన నిర్మల్ జిల్లా రైతు
నిరంతర ప్రయత్నం నిరాశను దరిచేరనివ్వదు. సాధించాలన్న సంకల్పం ముందు ఎదురయ్యే అవమానాలు విమర్శలు పెద్ద లెక్క కాదు. ఎదురీత ముందు విధిరాత ఎంత చెప్పండి. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ రైతు.
Ginger Cultivation: నిరంతర ప్రయత్నం నిరాశను దరిచేరనివ్వదు. సాధించాలన్న సంకల్పం ముందు ఎదురయ్యే అవమానాలు విమర్శలు పెద్ద లెక్క కాదు. ఎదురీత ముందు విధిరాత ఎంత చెప్పండి. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ రైతు. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామానికి చెందిన రైతు పాటుకురి గంగారెడ్డి..గతంలో పసుపు, మొక్కజొన్న, వరి సాగు చేసేవాడు. ఎంత శ్రమించినా అంతంత మాత్రంగానే లాభం వచ్చేది. ఈ క్రమంలో పసుపు స్థానంలో అల్లం సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.
అల్లం.. పేదోడి నుంచి కోటిశ్వరుడి వరకు ప్రతిరోజు కూరల్లో వాడతారన్నది తెలిసిన విషయమే. బహిరంగ మార్కెట్లో మద్ధతు ధర పడిపోతుందన్న ఇబ్బందే ఉండదు. వంటకాల్లోనే కాకుండా అల్లం ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. అలాంటి అల్లం సాగుచేసే ప్రాంతాలకు వెళ్లి వివరాలు తెలుసుకున్న గంగారెడ్డి…గతేడాది ఒక ఎకరంలో అల్లం సాగు ఆరంభించాడు. 100 క్వింటాళ్ల పైగానే దిగుబడి సాధించాడు. దీంతో ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో పంట విస్తరించాడు.
ఎకరం సాగుకు సుమారు రెండు లక్షల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. మార్కెట్లో ధర బాగుంటే మంచి లాభాలు సాధించవచ్చని అంటున్నాడు. వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో నీరు నిలిస్తే దుంప కుళ్ళు వస్తుందని, రైతులు ఈ మేరకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాడు. మే నుంచి జూన్ మధ్య కాలాన్ని అల్లం సాగుకు అద్భుతమైన కాలంగా పరిగణిస్తారు. మంచి తేమ వాతావరణం ఉంటే దిగుబడి బాగా వస్తుందని చెబుతున్నాడు రైతు గంగారెడ్డి.
Also Read:
ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
సీఏ చదివిన ఈ వ్యక్తి ఎంత క్రూరుడో.. భార్య పేరుతో భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి.. ఆపై తుదముట్టించాడు