Telangana: పెళ్లై నెల కూడా కాలేదు.. భార్య చేసిన పనికి భర్త షాక్.. పాపం, డ్యూటీకి వెళ్లొచ్చేసరికి..

Sangareddy district news: అవును.. వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరంటే ఒకరికి ప్రాణం అనేలా కనిపించారు. అనంతరం ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లై నాలుగు రోజులు అయిందో లేదో.. నవ వధువు మాత్రం వరుడికి షాకిచ్చింది..

Telangana: పెళ్లై నెల కూడా కాలేదు.. భార్య చేసిన పనికి భర్త షాక్.. పాపం, డ్యూటీకి వెళ్లొచ్చేసరికి..
Men And Woman

Updated on: Jun 18, 2023 | 3:43 PM

Sangareddy district news: అవును.. వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఒకరంటే ఒకరికి ప్రాణం అనేలా కనిపించారు. అనంతరం ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లై నాలుగు రోజులు అయిందో లేదో.. నవ వధువు మాత్రం వరుడికి షాకిచ్చింది.. ఇంట్లో ఉన్న రూ.2లక్షలు తీసుకుని ఉడాయించింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన రాజేశ్వర్, ఒడిషాకి చెందిన రష్మీక ప్రవల ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత నెల 23న ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది.. పెళ్లై దాదాపు నెల కావొస్తోంది.

ఏమైందో ఏమో తెలియదు కానీ.. నవవధువు మాత్రం ఇంట్లో కనిపించలేదు.. రాజేశ్వర్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. రోజూ లాగే.. రాజేశ్వర్ నిన్న పనికి వెళ్లిచ్చాడు. అయితే.. ఇంట్లో రశ్మిక ప్రవల కనిపించలేదు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న రూ.2 లక్షలు కూడా కనిపించలేదు. దీంతో రాజేశ్వర్ పక్కనున్న ఇళ్లలో.. అదే విధంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినా ఆచూకీ లభించకపోవడంతో.. రాజేశ్వర్BDL భానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

రూ.2 లక్షలతో భార్య పారిపోయిందని ఫిర్యాదులో తెలిపాడు. భర్త రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు .. మిస్సింగ్ కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us