AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్.. ఎందుకో తెలుసా..?

New Ration Cards: రేషన్ కార్డు ఇప్పుడు కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థకే పరిమితం కావడం లేదు. ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి పలు ప్రభుత్వ పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఇది కీలక పత్రంగా మారింది. అందుకే..

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్.. ఎందుకో తెలుసా..?
New Ration Cards
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 10:13 AM

Share

New Ration Cards: హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ మందగించింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నప్పటికీ పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినవారు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పలుమార్లు సివిల్ సప్లైస్ కార్యాలయాలకు వెళ్లినా, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నట్లు దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.

అధికారుల సమాచారం ప్రకారం.. సర్కిల్ స్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్న ఉద్యోగుల్లో కొందరు ఎన్నికల విధులు, మరికొందరు ఇతర ప్రభుత్వ పనుల్లో నిమగ్నం కావడంతో ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

సాంకేతిక సమస్యలు కూడా జాప్యానికి కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల పనితీరులో అంతరాయాలు రావడం వల్ల దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 30 వేల కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అర్హతల పరిశీలన పూర్తయిన తర్వాతే కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రేషన్ కార్డు ఇప్పుడు కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థకే పరిమితం కావడం లేదు. ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వంటి పలు ప్రభుత్వ పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఇది కీలక పత్రంగా మారింది. అందుకే కొత్త కార్డుల కోసం దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, అర్హులైన వారికి త్వరగా కార్డులు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..