Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై ఎన్డీటీవీ సర్వే నిర్వహించిందా..? ఇందులో నిజమెంత..

తెలంగాణ దంగల్ తుది దశకు చేరుకుంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మూడోసారి అధికారం కోసం భారత రాష్ట్ర సమితి.. ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఇలా.. మాటలు తూటాలతో సాగిన హోరాహోరీ ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది..

Telangana Elections: తెలంగాణ ఎన్నికలపై ఎన్డీటీవీ సర్వే నిర్వహించిందా..? ఇందులో నిజమెంత..
Telangana Elections

Updated on: Nov 28, 2023 | 1:46 PM

తెలంగాణ దంగల్ తుది దశకు చేరుకుంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మూడోసారి అధికారం కోసం భారత రాష్ట్ర సమితి.. ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఇలా.. మాటలు తూటాలతో సాగిన హోరాహోరీ ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది.. మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వం ముగుస్తుంది.. గురువారం (నవంబర్ 30) ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ఊపందుకుంది.. ఎవరికి వారే.. ఏవేవో సర్వేల పేరిట.. ఆయా పార్టీలు గెలుస్తాయంటూ తమకు అనుకూలంగా రిపోర్టులను ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. ప్రముఖ సంస్థలు, మీడియా ఛానెళ్ల పేరిట.. కొన్ని ఫేక్ సర్వేలను ఎడిట్ చేసి.. కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. దీని ద్వారా ప్రజల్లో గందరగోళానికి తెరదించుతున్నారు. ఫలానా పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ ఏకపక్షంగా సర్వేలను ఇస్తుండటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొందరు ప్రముఖ సంస్థల పేర్లతో అసత్య ప్రచారం చేయడం ఇటు రాజకీయాల్లో .. అటు ఓటర్లలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.

పోలింగ్‌కు కౌంట్ డౌన్ దగ్గరపడిన సమయంలో తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ సర్వే అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం తెలంగాణలో కలకలం రేపింది. ఎన్డీటీవీ పేరిట ఓ సర్వే రిపోర్టు వైరల్ అవ్వడంపై ఆ సంస్థ స్పందించింది. తెలంగాణలో తాము ఎన్నికల సర్వే చేపట్టినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని ప్రఖ్యాత జాతీయ ఛానెల్‌ ఎన్టీటీవీ ప్రకటించింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తాము ఎటువంటి సర్వే నిర్వహించలేదని ఎన్డీటీవీ స్పష్టం చేసింది. తమ పేరుతో తప్పుడు న్యూస్‌ ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అది పేక్‌ న్యూస్‌ అని తెలిపింది.

ఎన్డీటీవీ ట్వీట్ ..

కాగా.. ఎన్నికల వేళ ఇలాంటి ఫేక్ న్యూస్ లు తరచూ వైరల్ అవుతంటాయని.. వాటి గురించి అప్రమత్తంగా ఉండాలంటూ రాజకీయ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఏకపక్షంగా ఇచ్చే సర్వే రిపోర్టులను నమ్మవద్దంటూ సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..