AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ మెక్సికో నుండి అట్లాంటా వరకు.. పెట్టబడులే టార్గెట్‌గా అమెరికాలో తెలంగాణ కనెక్ట్స్ 2025

తెలంగాణ కనెక్ట్స్ 2025 USA కార్యక్రమం ద్వారా పరిశ్రమశాఖ అమెరికాలోని పలు నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తోంది. విదేశీ, NRI పెట్టుబడిదారులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడమే దీని లక్ష్యం. TS-iPASS సులభతర విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల శ్రామిక శక్తి, స్థిరమైన పాలనతో పెట్టుబడిదారులకు గొప్ప లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. అట్లాంటాలో భారీ సదస్సు జరగనుంది.

న్యూ మెక్సికో నుండి అట్లాంటా వరకు.. పెట్టబడులే టార్గెట్‌గా అమెరికాలో తెలంగాణ కనెక్ట్స్ 2025
Telangana Connects 2025 Usa
Krishna S
|

Updated on: Nov 15, 2025 | 12:38 PM

Share

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో తెలంగాణ కనెక్ట్స్ 2025 USA కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని లక్ష్యం విదేశాలలో ఉన్న పెద్ద పెట్టుబడిదారులను, అక్కడ స్థిరపడిన తెలుగు ఎన్నారైలను తెలంగాణంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడమే. తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎంత లాభం ఉంటుందో ఈ కార్యక్రమాల్లో వివరిస్తున్నారు.

అతిథిగా డాక్టర్ నవాబ్ ఖాన్

ఈ కార్యక్రమం అమెరికాలోని న్యూ మెక్సికో, న్యూజెర్సీ, వర్జీనియా, నార్త్ కరోలినా నగరాలలో జరుగుతుంది. నవంబర్ 21 న్యూ మెక్సికో, నవంబర్ 25న న్యూజెర్సీ, నవంబర్ 29న వర్జీనియా, డిసెంబర్ 2 నార్త్ కరోలినాలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. డిసెంబర్ 6న అట్లాంటాలో పెద్ద సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, జార్జియాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ హాజరుకానున్నారు. డాక్టర్ ఖాన్ తమ ప్రసంగంలో తెలంగాణలో ఉన్న పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరిస్తారు. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, ఆర్థిక రంగాలతో లోతైన సహకారాన్ని పెంచేందుకు ఆయన ప్రోత్సహిస్తారు.

తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం:

రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే అత్యంత ప్రగతిశీల, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా అవతరించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం పెట్టుబడిదారులకు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తోంది:

సులభతర విధానాలు: TS-iPASS ద్వారా చాలా వేగంగా వ్యాపార అనుమతులు ఇస్తారు.

ప్రపంచస్థాయి సదుపాయాలు: హైదరాబాద్‌లో అద్భుతమైన విమానాశ్రయం, ఐటీ పార్కులు వంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి.

శ్రామిక శక్తి: టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు.

సుస్థిరత: దీర్ఘకాలిక పెట్టుబడికి మద్దతు ఇచ్చే పారదర్శక పాలన, స్థిరమైన విధానాలు.

తెలంగాణ కనెక్ట్స్ 2025 USA కార్యక్రమం ద్వారా తెలంగాణను ప్రపంచ పటంలో ముఖ్యమైన పెట్టుబడి గమ్యస్థానంగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.