
Nitrate In Groundwater: తెలంగాణలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో (ఎగువ)ని భూగర్భ జలాల్లో ప్రమాదకర నైట్రేట్ నిలువలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ)ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నీటిని తీసుకున్న చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎరువుల వ్యర్థాలు జలాశయాల్లోకి ప్రవేశించడం ద్వారా భూగర్భ జలాలు తాగడానికి పనికిరాకుండా మారాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఎన్‌జీఆర్ఐకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త రామ మోహన్ కుర్కావాలా ఈ విషయమై మాట్లాడుతూ.. మహబూబ్ నగర్‌తో పాటు కృష్ణనదీ ఎగువ పరివాహక ప్రాంతాల్లోని భూగర్భ జలాలను తాగుతోన్న ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ఇందులో భాగంగా వర్షాకాలానికి ముందు తర్వాత జలాల నాణ్యతను పరీక్షించాము. ఆ నీటిలో నైట్రేట్,ఫ్లోరిడ్ అధికంగా ఉన్నట్లు గుర్తించాం. అమెరికా ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గైడ్‌లైన్స్ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామని చెప్పుకొచ్చారు. ఇక ఇందులో భాగంగా పరిశోధకులు వనపర్తి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లోని భూగర్భ జలాలకు చెందిన 116 నమూనాలను సేకరించారు. వర్షాకాలానికి ముందు 36.2 శాతం, అనంతరం 60.3 శాతం క్వాలిటీ ఇండెక్స్ ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా సదరు నీరు తాగడానికి పనికి రావని తేల్చిచెప్పారు. వ్యవసాయంలో ఎక్కువ ఎరువులు ఉపయోగించడం వల్లే భూగర్భ జలాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉందని రామ మోహన్ చెబుతున్నారు.
మార్స్ ఉపరితలం నుంచి మొట్ట మొదటిసారి చైనా రోవర్ ఝురాంగ్ పంపిన తొలి చిత్రాలు ఇవే..
Tata Motors: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలకు బాసట.. ఇతర కంపెనీలకు ఆదర్శంగా టాటా మోటార్స్