Viral: వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్నారు రైతులు. వ్యవసాయంలో తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా(Narayanpet district) నర్వ మండలం(Narva Mandal) రాంపూర్ గ్రామానికి చెందిన రైతు బాలేశ్వర్ రెడ్డికి ఓ ఉపాయం తట్టింది. పత్తి, కంది, ఆముదం, చెరకు వంటి పంటలకు మందు పిచికారి చేయాలంటే కూలీల కొరత బాధిస్తోంది. అందులోనూ పని ఆలస్యమౌతుంది. దీన్ని అధిగమించేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ట్రాక్టర్‌కు ఉన్న టైర్లతో పొలంలోకి వెళితే మొక్కలు దెబ్బతింటాయి. అంతేగాక ట్రాక్టర్ తిరగడం కష్టంగా మారుతుంది. అందుకే ట్రాక్టర్ టైర్లను తీసివేసి.. వాటి స్థానంలో బండి చక్రాలను అమర్చారు. దీని వల్ల మొక్కలు దెబ్బతినకుండా ఉండడంతో పాటు పూత, పిందె రాలకుండా మందు పిచికారి చేయవచ్చు. అంతేగాక పని కూడా త్వరితగతిన పూర్తవుతుంది. ఈ వినూత్న ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. సదరు రైతు ఆవిష్కరణను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు క్యూ కడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..