Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక అప్‌డేట్‌.. అక్టోబర్‌ 4న కోర్టుకు హాజరు కావాల్సిందిగా రేవంత్‌కు నోటీసులు.

|

Aug 28, 2021 | 12:38 PM

Revanth Reddy: ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015లో తెలంగాణ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని తమ పార్టీకి మద్ధతుగా..

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక అప్‌డేట్‌.. అక్టోబర్‌ 4న కోర్టుకు హాజరు కావాల్సిందిగా రేవంత్‌కు నోటీసులు.
Revanth Reddy
Follow us on

Revanth Reddy: ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015లో తెలంగాణ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీని తమ పార్టీకి మద్ధతుగా వ్యవహరించమని డబ్బు ఆశచూపిన ఆరోపణలపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నామినేటేడ్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్‌ సన్‌ ఇంట్లో రేవంత్‌ రెడ్డి డబ్బు సంచులతో ఉన్నట్లు ఉన్న వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ దీనిపై సుధీర్ఘంగా విచారణ జరుపుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రేవంత్‌తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నాంపల్లి ఎంఎస్ జే కోర్టు సమన్లు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌ షీట్‌ను స్వీకరంచిన నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు హాజరు కావాలని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టు సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్‌కు సమన్లు జారీ చేసింది.

Also Read: SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక..! ఆ వివరాలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనట..?

వీరమాచనేనికి విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్.. పవర్‌ఫుల్ పంచ్‌లు వేసిన బాబు గోగినేని

కోవిడ్-19 పుట్టుకపై సమాచారాన్ని తొక్కిపెడుతున్న చైనా..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం