Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..

మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ పరువునష్టం దావాపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సమంత విడాకులపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విడాకుల అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్.. కేసు నమోదుకు ఆదేశం..
Konda Surekha

Updated on: Aug 02, 2025 | 6:07 PM

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావాపై న్యాయస్థానం విచారణ జరిపింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.  నాంపల్లి కోర్టు ఆదేశించింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడిన మంత్రి.. సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విడాకుల అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.  దీంతో ఆయన పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను బీఎన్ఎస్ 356 కింద కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇదే సమయంలో మంత్రి తరఫు న్యాయవాది అభ్యంతరాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని.. కేసు నమోదుకు ఆదేశాలివ్వాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కేసు నమోదుపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కోర్టు నుంచి నోటీసు వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తానని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..