Nama Nageswara Rao: నేనెవర్నీ మోసం చేయలేదు.. న్యాయవ్యవస్థపై నమ్మకముంది.. నామా సంచలన వ్యాఖ్యలు

|

Jun 19, 2021 | 1:28 PM

TRS MP Nama comments: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సంబంధించి కంపెనీలు, ఇళ్లపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన

Nama Nageswara Rao: నేనెవర్నీ మోసం చేయలేదు.. న్యాయవ్యవస్థపై నమ్మకముంది.. నామా సంచలన వ్యాఖ్యలు
Nama Nageswara Rao
Follow us on

TRS MP Nama comments on ED Raids: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సంబంధించి కంపెనీలు, ఇళ్లపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని ఆరోపణలు రావడంతో దాడులు జరిగాయి. అయితే.. ఈ కేసుకు సంబంధించి నామా జూన్‌ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మాట్లాడారు. 40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించానని.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్నానని నామా పేర్కొన్నారు. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా తమ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోందన్నారు. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదని స్పష్టంచేశారు. ఈ సంస్థను తన ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చిందని.. కంపెనీల్లో తాను ఎండీగా లేనన్నారు. తనకు న్యాయవ్యవస్థ పై పూర్తిగా నమ్మకం ఉందని పేర్కొన్నారు.

25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్లి అన్నింటికి సమాధానం చెప్పి.. అధికారులకు సహకరిస్తానన్నారు. తానెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్నా అన్నారు. తనను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారని.. తన బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు అంటూ పేర్కొన్నారు. అయితే.. 16వందల కోట్ల ప్రాజెక్టులో 460 కోట్లు కంపెనీ ఇవ్వాలి. మిగతా అమౌంట్ బ్యాంక్ లు ఇవ్వాలని తెలిపారు. అయితే.. బ్యాంకు ప్రాజెక్టు మీద 652 కోట్లు మాత్రమే పెట్టిందన్నారు. వడ్డిగా 378 కోట్లు తీసుకుందని వివరించారు. ప్రాజెక్ట్ టర్మీనెట్ చేసే సమయానికి 60శాతానికి పైగా ప్రాజెక్టు వర్క్ అయినట్లు వెల్లడించారు. అయితే.. ప్రాజెక్టుపై మూడు కాంట్రాక్టులు ఉన్నాయన్నారు. దీనిపై ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

ఈ కేసు విషయాల్లోకి వెళితే.. 2011లో జార్ఖండ్‌లో రాంచీ – రార్‌గావ్‌ – జంషెడ్‌పూర్‌ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్‌ హైవే–33 పనులను మధుకాన్‌ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో పనులను చేజిక్కించుకుంది. ఆ తర్వాత కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. అనంతరం మధుకాన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ న్యూఢిల్లీని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్‌ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఇదే విషయంపై సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. మధుకాన్‌ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. దీంతో మనీ ల్యాండరింగ్‌ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

Also Read:

Ahmedabad Crime News : గుట్కా కొనివ్వలేదని స్నేహితుడిపై కత్తితో దాడి..! నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు..

కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలు.. ఆంక్షలు సడలింపుల నేపధ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ..