World Records: గిన్నిస్ బుక్‌లో తెలంగాణ యువతి.. ప్రపంచంలోనే అతి పెద్ద బుక్‌కి 200 ఆర్టికల్స్ రాసిన జుహీదా బేగం..

| Edited By: Surya Kala

Sep 01, 2023 | 1:57 PM

నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెం గ్రామానికి చెందిన జుహీదా బేగం.. నిరుపేద కుటుంబంలో జన్మించింది. చిన్నతనం నుంచే చదువులో ముందుండేది. పీజీ చేసిన జుహీదా బేగం.. హైదరాబాద్‌లోని హయతనగర్‌ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా పని చేస్తోంది. రాచకొండ ఎన్ఎస్ఎస్ పీవో గైడ్ గా విధులు నిర్వర్తిస్తోంది. తమిళనాడులోని ఈఎస్ఎన్ పబ్లికేషన్స్ 100100 పేజీలతో షీ ఫర్‌ హర్‌ సెల్ప్‌ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది.

World Records: గిన్నిస్ బుక్‌లో తెలంగాణ యువతి.. ప్రపంచంలోనే అతి పెద్ద బుక్‌కి 200 ఆర్టికల్స్ రాసిన జుహీదా బేగం..
Guinness World Records
Follow us on

వ్యక్తిలో ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటూ అనేక మంది తమ ప్రతిభాపాటవాలతో నిరూపిస్తున్నారు. మరికొందరు తమకు సొంతమైన ప్రతిభతో ప్రముఖంగా వార్తల్లో నిలవడమే కాదు.. ఏకంగా ప్రపంచ ఖ్యాతిగాంచుతున్నారు. తాజాగా తన ప్రతిభ పాటవాలతో రచయితగా నల్లగొండ జిల్లాకు చెందిన మహిళ లెక్చరర్ గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకానికి 200 ఆర్టికల్స్ రాసి ఆమె ఈ బుక్ కు ఎడిటర్ గా వ్యవహరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకం ఏంటి..? ఆ మహిళ రచయిత ఎవరు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం..

నల్లగొండ జిల్లా అనుముల మండలం హజారీగూడెం గ్రామానికి చెందిన జుహీదా బేగం.. నిరుపేద కుటుంబంలో జన్మించింది. చిన్నతనం నుంచే చదువులో ముందుండేది. పీజీ చేసిన జుహీదా బేగం.. హైదరాబాద్‌లోని హయతనగర్‌ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా పని చేస్తోంది. రాచకొండ ఎన్ఎస్ఎస్ పీవో గైడ్ గా విధులు నిర్వర్తిస్తోంది. తమిళనాడులోని ఈఎస్ఎన్ పబ్లికేషన్స్ 100100 పేజీలతో షీ ఫర్‌ హర్‌ సెల్ప్‌ అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంధానికి 200 ఆర్టికల్స్‌ రాయడంతో పాటు ఎడిటర్ గా జుహీదా బేగం వ్యవహరించింది.

దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకంలో భాగస్వామి అయిన మహిళ రచయితగా జుహీదా బేగం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. గత నెల 28వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో జహీదా బేగంకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి అధికారిక పత్రంతో పాటు ప్రశంస పత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందజేశారు. తమ గ్రామానికి చెందిన మహిళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో హజారిగూడెంలో సంబరాలు జరుపుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం సంతోషంగా ఉందని జుహీదా బేగం చెబుతున్నారు. ఈ రికార్డును తన తండ్రి దస్తగిరికి అంకితం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..