Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి.. నీటమునిగిన నిడమనూరు, నర్సింహులగూడెం..

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. కాలువ నుంచి ఊళ్లలోకి నీరు

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి.. నీటమునిగిన నిడమనూరు, నర్సింహులగూడెం..
Sagar Canal

Updated on: Sep 08, 2022 | 1:23 PM

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి పడింది. నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. కాలువ నుంచి ఊళ్లలోకి నీరు ప్రవహిస్తున్నాయి. గండిపడిన చోట కాలువ సుడిగుండాన్ని తలపిస్తోంది. కాగా, గండి నుంచి బయటకు వస్తు్న్న నీరు.. నిడమనూరు, నర్సింహులగూడుం గ్రామాల్లో ఇళ్లలోకి వస్తున్నాయి. మిర్యాలగూడ-దేవరకొండ రహదారిపైకి భారీగా నీరు వస్తోంది. దాంతో ఆ దారిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. నిడమనూరు మినీ గురుకుల పాఠశాల నీట మునిగింది. పెద్దవూరకు చెందిన 87 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు.

కాగా, గండి పడడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. అయితే.. అప్పటికే నీరంతా 500 ఎకరాల్లో పంటల్ని ముంచేసింది. నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండి పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిడమనూరు, నర్సింహులగూడెం గ్రామాల్లో ఏడు అడుగుల ఎత్తులో నీరు చేరింది. వందల ఎకరాల్లోకి వరద రావడంతో.. భారీగా పంట నష్టం జరిగింది. కాలువలోకి ప్రస్తుతం నీటిని నిలిపివేయడంతో.. ప్రవాహం కాస్త తగ్గింది. యూటీ దగ్గర లీకేజీ కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గండి పడిన వెంటనే ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో గండిని పూర్తిగా పూడ్చివేస్తామని చెప్పారు నాగార్జునసాగర్ సిఈ శ్రీకాంత్‌.

ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. ముంపు ప్రభావిత ప్రాంతంలోని విద్యార్థులను, నిడమనూరులోని 20 కుటుంబాలను తరలించామని తెలిపారు. హాలియా డైవర్షన్ నుంచి వాగులోకి వదులుతున్నామని చెప్పారు. ఉదయం వరకు నీరు మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మినీ గురుకులాన్ని రేపు ఉదయం శానిటేషణ్ చేసి, తిరిగి పాఠశాలలోకి విద్యార్థులను పంపిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..