మై హోమ్‌ గ్రూప్‌‌నకు 2 ప్రతిష్ఠాత్మక అవార్డులు.. వరల్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కాంగ్రెస్‌లో అందజేత

వ్యాపార రంగంలో దూసుకుపోతున్న మై హోమ్‌ గ్రూపునకు..జాతీయ స్థాయిలో రెండు ప్రిస్టీజియస్‌ అవార్డులు దక్కాయి. HR విభాగం, మాన్యుఫాక్చరింగ్‌ విభాగంలో ఈ అవార్డులను మై హోమ్‌ గ్రూప్‌ దక్కించుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఈ స్టోరీలో ఓసారి లుక్కేయండి మరి.

మై హోమ్‌ గ్రూప్‌‌నకు 2 ప్రతిష్ఠాత్మక అవార్డులు.. వరల్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కాంగ్రెస్‌లో అందజేత
My Home Group

Updated on: Feb 22, 2025 | 8:55 AM

వ్యాపార రంగంలో విజయకేతనం ఎగురవేస్తూ అప్రతిహతంగా దూసుకుపోతున్న మై హోమ్‌ గ్రూప్‌ని మరో రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వరించాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఈ అరుదైన అవార్డులు దక్కాయి. ముంబైలోని తాజ్‌ ల్యాండ్స్‌లో నిర్వహించిన వరల్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కాంగ్రెస్‌ అండ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో ఈ పురస్కారాలను అందజేశారు. మాన్యూఫాక్చరింగ్‌, మానవ వనరుల విభాగంలో మెరుగైన ప్రదర్శనకుగాను మై హోమ్‌ గ్రూప్‌కు ఈ అవార్డులు దక్కాయి. నేషనల్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్ అవార్డును జి. లక్ష్మీనారాయణ దక్కించుకున్నారు. ఆయన మై హోమ్‌ ఇండస్ట్రీస్‌, మానవ వనరుల విభాగంలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

బెస్ట్‌ హెచ్‌ఆర్‌ ప్రాక్టీసెస్‌ కింద ఈ అవార్డును ఆయనకు అందజేశారు. సూపర్‌ అచీవర్ అవార్డును మై హోమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ వీఎస్‌ నారంగ్‌ అందుకున్నారు. తయారీ రంగంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి చేపట్టిన కొత్త ఆవిష్కరణలు, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తి విధానాలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న ప్రత్యేక చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డులు సంస్థ భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన వినూత్న కార్యక్రమాలను అమలు చేయడానికి, తయారీ రంగంలో మరిన్ని మైలురాళ్లు సాధించడానికి ప్రేరణ కలిగిస్తాయంటున్నారు.