Telangana: నా బర్రెలు పోయాయ్.. వెతికి పెట్టండి సర్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు

| Edited By: Jyothi Gadda

Jul 24, 2023 | 9:12 PM

Nirmal : పశువుల షెడ్ లో కట్టేసిన గేదేలు కనిపించకుండా పోవడంతో ఊరంతా గాలించాడు. చివరికి ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించి సాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు‌ దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

Telangana: నా బర్రెలు పోయాయ్.. వెతికి పెట్టండి సర్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు
Nirmal District
Follow us on

నిర్మల్, జులై 24: ఈ మద్య దొంగలు రైతులను టార్గెట్ చేస్తున్నారు. టమాట పంట కాసుల వర్షం కురిపిస్తుండటంతో రైతులు రాజులయ్యారని ఫీలవుతున్నారో లేక రైతు సొమ్మైతే ఈజీగా కొట్టెయ్య వచ్చని ఫిక్స్ అవుతున్నారో తెలియదు కానీ, దొంగలు రూటు మార్చి రైతుల పంట పొలాల మీద పడుతున్నారు. తాజాగా అలాంటి దొంగతనమే నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రేడ్ లో చోటు చేసుకుంది. ఓ రైతుకు చెందిన రెండు బర్రెలను దొంగిలించారు దుండగులు. పక్కా స్కెచ్ వేసి మరీ బర్రెలను ఎత్తుకెళ్లారు. తీరా తన బర్రెలు కనిపించకపోవడంతో ఊరంతా వెతికి పోలీస్ స్టేషన్ కు చేరాడు సదరు‌ రైతు. సర్ సర్ నా బర్రెలు పోయాయి వెతికి పెట్టండి అంటూ తానూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

నిర్మల్ జిల్లా తానుర్ మండలం బొంద్రేడ్ గ్రామానికి చెందిన సురేష్ పటేల్ అనే రైతు కూరగాయల సాగుతో పాటు బర్రెలను పెంచి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత రాత్రి తనకున్న నాలుగు గేదేలలో ఓ రెండు పాలిచ్చే గేదెలు‌ కనిపించకుండా పోయాయి. పశువుల షెడ్ లో కట్టేసిన గేదేలు కనిపించకుండా పోవడంతో ఊరంతా గాలించాడు. చివరికి ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించి సాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. 2.50 లక్షల విలువ చేసే రెండు పాలిచ్చే గేదెలు‌ కనిపించకుండా పోయాయని… వెతికి పెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు‌ దర్యాప్తు చేపట్టి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..