మీరు నాన్ వెజ్ లవర్సా..? అందులోనూ మటన్ అంటే లొట్టలేసుకుంటూ తింటారా..? అయితే మీకే ఈ గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా మటన్ క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి. స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ మటన్ క్యాంటీన్లలో తెలంగాణ స్పెషల్… నోరూరించే మటన్ బిర్యానీతో పాటు చాలామంది ఇష్టపడే పాయ, కీమా, గుర్దా ఫ్రై, పత్తార్ కా గోస్ట్ వంటి టేస్టీ మటన్ ఐటమ్స్ ఎన్నో అందుబాటులో ఉంటాయి.
అయితే ఫస్ట్ క్యాంటీన్‌ను కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫీసు ఉన్న శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంటీన్ ఈ మార్చిలోనే స్టార్టవ్వనుంది. అయితే మెనూతో పాటు రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు. సరసమైన ధరలకే మటన్ వంటకాలను అందిస్తామని షిప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ తెలిపింది.
ఫిష్ క్యాంటీన్లలాగానే మటన్ క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిష్ క్యాంటీన్లలో ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి చాలా వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫిష్ క్యాంటీన్లు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండటంతో.. మటన్ క్యాంటీన్లను కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..