Seethakka: సీతక్క దరువేస్తే అట్లుంటది మరి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే..

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బై ఎలక్షన్ కావడంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి...

Seethakka: సీతక్క దరువేస్తే అట్లుంటది మరి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఎమ్మెల్యే..
Seetakka In Munugodu

Updated on: Oct 16, 2022 | 12:45 PM

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బై ఎలక్షన్ కావడంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం సాధించేందుకు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు డప్పు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్రచారంలో సీత‌క్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ‌ప్పు క‌ళాకారుల‌తో కాలు కదిపారు. తనదైన శైలిలో డప్పు కొట్టి ద‌రువేశారు ఎమ్మెల్యే.

మునుగోడులోని నాంప‌ల్లి మండ‌లంలో అక్టోబరు 15న సీత‌క్క ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా డ‌ప్పు క‌ళాకారుల విజ్ఞప్తితో భుజానికి డ‌ప్పు త‌గిలించుకుని మ‌రీ వారితో కలిసి డ‌ప్పు వాయించారు. అంతే కాకుండా డ‌ప్పు చ‌ప్పుళ్లకు ద‌రువు వేశారు. అనంత‌రం మండ‌ల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి స్రవంతిని గెలిపించాల‌ని ఓట‌ర్లను అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి