MP Santhosh: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు ముఖ్యమంత్రిపై ఉన్న ఇష్టాన్ని చాటుతూనే ఉంటారు. సంతోష్ కుమార్.. కేసీఆర్ సతీమణి సోదరి శశికళ కుమారుడనే విషయం తెలిసిందే. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో సంతోష్ కుమార్ నిత్యం వార్తలో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలతో చెట్లను నాటిస్తూ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్నారు సంతోష్.
ఇదిలా ఉంటే తాజాగా సంతోష్ కుమార్ మంగళవారం తన 44వ పుట్టిన రోజును జరపుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్‌కు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఈ మేరకు ఆయన ఉప్పల్ భగాయత్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇదిలా ఉంటే పుట్టిన రోజు సందర్భంగా సంతోష్ కుమార్ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన ఫోటోను పోస్ట్ చేశారు. సంతోష్‌ను కేసీఆర్ తన భుజాలపై ఎత్తుకొన్న సమయంలో దిగిన పాత ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ ఫోటో.. ‘ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
“ఈ పుట్టుక నాది …..
బ్రతుకంతా మీది ……” pic.twitter.com/LHzUit0jLi— Santosh Kumar J (@MPsantoshtrs) December 7, 2021
Also Read: Narendra Modi: సిరివెన్నెల సతీమణికి ప్రధాని మోడీ లేఖ.. ఆయనను స్మరించుకుంటూ…
Sai Pallavi: నేచురల్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే వావ్ అంటారు.. సాయి పల్లవి న్యూ పిక్స్..
Burundi prison fire: నైరోబి జైలులో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది ఖైదీల సజీవదహనం.. 69మందికి గాయాలు!