Asaduddin Owaisi: సమాజ్‌వాదీ నేతపై దేశద్రోహం కేసు పెడితే… ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడిన ఒవైసీ

|

Aug 20, 2021 | 6:48 AM

Asaduddin Owaisi: ఆఫ్ఘాన్‌ సంక్షోభంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ స్పందించారు. ఆఫ్ఘాన్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని దేశవ్యాప్తంగా నేతలు గగ్గోలు పెడుతున్నారు..

Asaduddin Owaisi: సమాజ్‌వాదీ నేతపై దేశద్రోహం కేసు పెడితే... ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడిన ఒవైసీ
Asaduddin Owaisi
Follow us on

Asaduddin Owaisi: ఆఫ్ఘాన్‌ సంక్షోభంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ స్పందించారు. ఆఫ్ఘాన్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని దేశవ్యాప్తంగా నేతలు గగ్గోలు పెడుతున్నారు.. కానీ ఇండియాలో చాలా మంది మతతత్వ రాజకీయాలకు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.. భర్తలు కోల్పోయిన ఆ మహిళల పరిస్థితేంటని ప్రశ్నించారు. భారత్‌లో జరిగే దాడులకు ఎవరు సమాధానం చెప్తారని మండిపడ్డారు.

అటల్ బిహారీ వాజ్పేయి మన్మోహన్సింగ్ మోడీ ప్రభుత్వాలు మూడు బిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టారు, ఏ స్వార్థం కోసం కోసం ఖర్చుపెట్టారని అడిగితే.. ఆఫ్ఘాన్‌లో మహిళలపై దాడులు జరగుతున్నాయంటూ సమాధానం దాటవేస్తున్నారు. భారత్‌ గతంలో చర్చలు జరిపి ఉంటే బాగుండేది, దేశం కోసం పార్లమెంటులో గొంతు చించుకుని చెప్పినా నా మాట వినలేదు. ఈరోజు ఆఫ్ఘాన్‌లో ఎక్కువగా లబ్ధి పొందేది చైనా…ఆఫ్ఘానిస్తాన్‌ చాలా పెద్దదేశం…అక్కడ చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా పనిచేయదు…ఆ ప్రాంతాల్లో లష్కర్‌, ఐసీస్‌ తీవ్రవాదులు సిరియా, ఇరాక్‌ నుంచి అక్కడకు చొరబడ్డారు,జైషే మహ్మద్‌ కూడా పాగా వేసింది, తాలిబాన్లను ఐసీస్‌ కంట్రోల్‌ చేస్తోంది, ఐఎస్‌ఐఎస్‌ భారత్‌కు పెద్ద శత్రువు,నాకు నా దేశం ముఖ్యం… పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌తో నాకేంటి.. నా దేశం గురించి ఎన్నోసార్లు నేను గొంతు చించుకుని చెప్పినా నా మాట వినలేదు

సమాజ్‌వాదీ నేతపై దేశద్రోహం కేసు పెడితే… ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు.. ముస్లిం ఓట్లతో గెలిచి ఇప్పుడు నోరు మెదపడం లేదని అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reporter: Noor Mohammad, TV9 Telugu

Also Read:  వరలక్ష్మి వ్రతం స్పెషల్.. కొత్తబియ్యంతో పులగం తయారీ విధానం..

అమ్మవారికి నైవేధ్యంగా ఆంధ్రా స్టైల్‌లో తియ్యతియ్యటి పూర్ణం బూరెలు.. తయారీవిధానం