ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ ప్రమాదం వృద్ధులలోనే కనిపించేది.. ఇటీవలి కాలంలో, యువత, పిల్లలు కూడా గుండెపోటుతో రెప్పపాటులో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!
Mother Dies Of Heart Attack

Edited By:

Updated on: Mar 23, 2026 | 1:46 PM

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఒకప్పుడు ఈ సైలెంట్ కిల్లర్ ప్రమాదం వృద్ధులలోనే కనిపించేది.. ఇటీవలి కాలంలో, యువత, పిల్లలు కూడా గుండెపోటుతో రెప్పపాటులో ప్రాణాలే కోల్పోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం నాయుడు పేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు తన పిల్లలతో ఆనందంగా గడిపిన మహిళ గుండెపోటుతో మృతి చెందింది.

నాయుడుపేటకు చెందిన సుష్మకు మహబూబాబాద్ జిల్లా సలారు తండాకు చెందిన భూక్యా సందీప్ తో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. సందీప్ పారిశుద్ధ్య పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుష్మ కూలి పనులకు వెళ్తుంది. రెండు రోజుల క్రితం పిల్లలతో కలిసి నాయుడుపేట వచ్చారు. ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున సుష్మ మూడేళ్ల చిన్న కుమారుడుతో సరదాగా గడిపింది. అతన్ని ముద్దాడుతూనే కుప్పకూలి కింద పడిపోయింది. ఆమె గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండె పోటుతో మరణించినట్లు నిర్దారించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇటీవలి కాలంలో, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన పరిసరాల్లో గుండెపోటు కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో, వృద్ధులలో గుండెపోటు సర్వసాధారణం. కానీ నేడు ఇది ప్రతి ఒక్కరిలోనూ సర్వసాధారణంగా మారడం భయాందోళన కలిగిస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us