
ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు పిల్లలకు అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించి.. ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. మృతులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. లింగరాజు-స్వాతి దంపతుల స్వగ్రామం ఏదులపురం మున్సిపాలిటీ లోని గుర్రాలపాడు కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ లో నివాసం ఉంటున్నారు. గుర్రాలపాడులో ఉండి వ్యవసాయం చేసుకుందామని భర్త చెప్పడంతో.. స్వాతి వ్యతిరేకించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో నిన్న భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలకు అన్నంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. లింగరాజు వచ్చే సరికి పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భర్త తన మాట వినడం లేదని కోపంతో స్వాతి నేను సాయంత్రం ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు అన్నంలో ఎలుకలు ముందు కలిపి తినిపించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు భర్తకు ఫోన్ చేసి పిల్లలకు పుడ్ పాయిజన్ అయ్యిందని త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. ఈలోపే పరిస్థితి విషమించడంతో హుటాహుటిన అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు. పిల్లలతో కలిసి భార్యాభర్తలు ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతం గాంధీనగర్ లో నివాసం ఉంటున్నారు. భర్త లింగరాజు స్థానికంగా పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఇబ్బందిగా ఉంది సొంతూరు గుర్రాలపాడు కి వెళదామని అక్కడే కాపురం చేద్దామని భర్త చెప్పడంతో.. అప్పటినుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..