Telangana: రాజ్‌భవన్‌- ప్రగతిభవన్‌ మధ్య మరింత గ్యాప్‌.. ఉగాది వేడుకలకు హాజరు కానీ సీఎం, మంత్రులు!

|

Apr 01, 2022 | 9:42 PM

దేశంలో గవర్నర్‌లు, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఉన్నాయి. ప్రస్తుతమూ కొనసాగుతున్నాయి. ఇటీవలే ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.

Telangana: రాజ్‌భవన్‌- ప్రగతిభవన్‌ మధ్య మరింత గ్యాప్‌.. ఉగాది వేడుకలకు హాజరు కానీ సీఎం, మంత్రులు!
TS Governor Tamilasai, CM KCR
Follow us on

Telangana Poltics: దేశంలో గవర్నర్‌(Governor)లు, ముఖ్యమంత్రు(Chief Minister)ల మధ్య వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఉన్నాయి. ప్రస్తుతమూ కొనసాగుతున్నాయి. ఇటీవలే ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్(Tamilasai Soudararajan), సీఎం కే. చంద్రశేఖర్ రావు(CM KCR)ల మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ఏర్పడ్డాయి. కొత్త సంవత్సరం శుభకృత్‌తో అయినా, ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. స్నేహం మాట అటుంచితే, అసలు మంత్రులు గానీ, టీఆర్‌ఎస్‌ నేతలు కనీసం రాజ్‌భవన్‌ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గత రిపబ్లిక్‌డే నాడు అవి మరింత బహిరంగం అయ్యాయి. తాజాగా కొత్త సంవత్సరం వేడుకలతో ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌కు మరింత గ్యాప్‌ పెరిగిందని స్పష్టమైంది.

ఉగాది ఉత్సవాలకు రావాలంటూ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు గవర్నర్‌ తమిళసై. రాజ్‌భవన్‌లో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ప్రగతి భవన్‌కు ఆహ్వానం పంపారు. కానీ, కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎవరూ కూడా రాజ్‌భవన్‌వైపు కన్నెత్తి చూడలేదు. సీఎం, మంత్రులకు ఆహ్వానం పంపినా గైర్హాజరయ్యారు. పోలీస్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పెద్దగా హాజరుకాలేదు. అటు ఈ వేడుకల్లో ఓ ఫ్లెక్సీ ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది. రాజ్‌భవన్‌లో ఉగాది ఫ్లెక్సీలపై కేసీఆర్‌ ఫోటో ఎక్కడా కనిపించలేదు.

ఈ ఉగాది వేడుకలతోనైనా కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో అడుగుపెడతారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ హాజరుకాలేదు. గతంలో గవర్నర్‌గా ఉన్న ఈఎస్‌ఎల్‌ నర్సింహన్‌ స్థానంలో 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని రాష్ట్ర గవర్నర్‌గా నియమించారు రాష్ట్రపతి. అప్పుడు కేసీఆర్‌కు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు సీఎం హాజరయ్యేవారు. కానీ, కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ, సీఎం కార్యాలయం పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి గవర్నర్‌, సీఎం దూరం దూరంగానే ఉంటున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం వద్దన్నా, నిమ్స్‌కు వెళ్లడం, కొన్ని విషయాలపై ప్రభుత్వ అధికారుల వివరణ కోరడం, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక బాక్స్‌ను ఏర్పాటు చేయడం, వంటివి గ్యాప్‌ పెరగడానికి కారణమనే ప్రచారం జరిగింది. కాగా, ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్తాయో వేచి చూడాలి మరీ.

Read Also…. BJP in Rajya Sabha: రాజ్యసభలో చరిత్ర సృష్టించిన బీజేపీ… తొలిసారిగా 100కి చేరిన సభ్యుల సంఖ్య