
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌లో విషాదం నెలకొంది. కోతుల దాడిలో ఓ మహిళ తలకు దెబ్బతగిలి అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల ప్రాకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల (59) ఇంట్లోకి బుధవారం ఉదయం కోతుల గుంపు వచ్చింది. కోతులు బీభత్సం సృష్టించడంతో.. ఆమె వాటిని పంపే ప్రయత్నం చేసింది. కానీ.. కోతులన్నీ ఎదురు తిరిగాయి. ఆమెపై దాడికి చేసే క్రమంలో విమల వెనక్కి పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది.
గమనించిన స్థానికులు ఆమెను హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.. పరీక్షించిన వైద్యులు అప్పటికే.. ఆమె మృతి చెందిందని తెలిపారు. కాగా గత కొన్నాళ్లుగా ఆ గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలోనే.. గ్రామంలో మహిళ చనిపోవడంతో స్థానికులు మరింత భయపడుతున్నారు.
నిత్యం.. కోతులు గుంపులు. గుంపులుగా వచ్చి ఇళ్లల్లోకి చొరబడుతున్నాయని.. దాడులు కూడా చేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ కోతుల సమస్య నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..