IND VS AUS: “జీతేగా జీతేగా…. హిందుస్థాన్ జీతేగా” అంటున్న కవిత
వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-ఆస్ట్రేలియా మహా యుద్ధం ప్రారంభం కానుంది. టాస్ గెలిసి ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫైనల్ ఫైట్‌లో నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయ్ ఇరు జట్లు. ఈ హైవోల్టేజ్ ఫైట్‌ను ప్రత్యక్ష్యంగా చూసేందుకు అహ్మదాబాద్ స్టేడియానికి క్యూ కట్టారు ప్రేక్షకులు. ఇసుకేస్తే రాలనంత జనంతో స్టేడియం కిక్కిరిసిపోయింది.
సుమారు లక్షన్నర మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది అహ్మదాబాద్ స్టేడియం. ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంతమంది జనంతో నిండిపోయాయి పరిసరాలు. స్టేడియం లోపలా బయటా అరుపులు కేకలతో హోరెత్తిపోతోంది. అహ్మదాబాదే కాదు… దేశం మొత్తం జయహో భారత్ నినాదాలతో మార్మోగిపోతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు మంచి ఆరంభమే ఇచ్చారు. కాగావరల్డ్ కప్ పై యువతతో కలిసి కల్వకుంట కవిత చేసిన వీడియో వైరల్ అవుతుంది. వరల్డ్ కప్ ఫైనల్ లో టీం ఇండియా గెలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. “జీతేగా జీతేగా…. హిందుస్థాన్ జీతేగా” అంటూ యువతతో కలిసి కల్వకుంట్ల కవిత చేసిన వీడియోను “ఎక్స్” లో పోస్ట్ చేశారు.
వరల్డ్‌కప్ ఫైనల్ ఫీవర్‌తో దేశం మొత్తం ఊగిపోతోంది. భారత్ గెలవాలంటూ పూజలు, యాగాలు, ప్రార్థనలు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక, భారత్-ఆస్ట్రేలియా బిగ్ ఫైట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు అభిమానులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..