బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

BRS సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఆమె పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తూ ఉండటంతో.. అధినేత ఆదేశాల మేరకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
MLC Kavitha

Edited By:

Updated on: Sep 02, 2025 | 2:24 PM

బీఆర్‌ఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.  కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ  నిర్ణయం తీసుకుంది పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలయింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ ఆరోపించింది. ఈ క్రమంలో అధ్యక్షుడి అదేశాల మేరకు తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బీఆర్‌ఎస్‌ లీగల్‌ అడ్వొకేట్‌ హోదాలో కవిత లిక్కర్‌ కేసును వాదించిన సోమభరత్‌, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి హోదాలో ఆమెపై వేటువేస్తూ జారీచేసిన లేఖపై సంతకం చేశారు.

‘‘ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అని పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది.